రొమాంటిక్ రిలేషన్ షిప్ లో కూడా ఒత్తిడి.. దీనివల్ల ఏమౌతుందో తెలుసా?

First Published | Jul 2, 2023, 10:33 AM IST

ఒత్తిడి మీ వర్క్ జీవితాన్నే కాదు.. రొమాంటిక్ రిలేషన్ షిప్ ను కూడా ప్రభావితం చేస్తుంది. మీ భాగస్వామితో  తక్కువ సాన్నిహితంగా ఉంటే మీరు మీ రిలేషన్ షిప్ లో ఒత్తిడిని ఫేస్ చేస్తున్నట్టే. దీనికి కారణాలేంటంటే..?
 

ఒత్తిడి లేని జీవితం మొత్తమే ఉండదు. కాకపోతే ఒత్తిడిని తగ్గించుకోవడానికి  ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది వర్క్ లైఫ్ నే కాదు మీ మొత్తం ఆరోగ్యాన్ని కూడా ఎంతో ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది మీ రిలేషన్ షిప్ ను ఎంతో ప్రభావితం చేస్తుంది. అందుకే పాజిటివ్ అయినా.. నెగెటివ్ అయినా.. జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవాలి. కానీ అది ఎప్పుడూ సాధ్యం కాదు. ఈ ఒత్తిడి మీ ప్రేమ జీవితాన్ని కూడా ప్రభావితం చేసే సందర్భాలు ఉంటాయి. రొమాంటిక్ రిలేషన్ షిప్ లో ఒత్తిడి ఎన్నో ఒడిదుడుకులకు దారితీస్తుంది. అసలు రిలేషన్ షిప్ లో ఒత్తిడి కలగడానికి అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

వాదనలు పెరగడం

చిన్న చిన్న విషయాలకు కూడా ఎప్పుడూ వాదించుకునే వారు ఉన్నారు. నిజానికి ఇది అంతర్లీన ఒత్తిడికి సంకేతం. ఒత్తిడి స్థాయిలు పెరిగినప్పుడు కమ్యూనికేషన్ ఒత్తిడికి గురవుతుంది. ఇది ఎప్పుడూ గొడవలకు, కొట్లాటలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 


కమ్యూనికేషన్ లేకపోవడం

రిలేషన్ షిప్ లో ఒకరి ఆలోచనలను ఇంకొకరు ఖచ్చితంగా పంచుకోవాలి. అలాగే తోడుగా ఉండాలి. అయితే మీ ఆలోచనలను, భావాలను లేదా ఇతర విషయాలను మీ భాగస్వామితో చెప్పలేకపోతున్నారంటే మీ ఇద్దరూ ఒత్తిడికి గురవుతున్నారని అర్థం. మీరు లేదా మీ భాగస్వామి బహిరంగంగా మాట్లాడటానికి  ఇష్టపడకపోయినా లేదా మీ ఇద్దరి మధ్య మ్యూనికేషన్ లోపం ఉన్నా.. ఒత్తిడికి గురవుతున్నట్టే. ఒత్తిడి మీ కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. 

భావోద్వేగంగా దూరం

మీరిద్దరూ ఒకే గదిలో ఉండొచ్చు. కానీ మీరు మానసికంగా దూరమైతే ఒత్తిడి మీఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. మీ ఇద్దరి మధ్య భావోద్వేగ సాన్నిహిత్యం తగ్గుతుంది. ఇది  మిమ్మల్ని ఒకరికొకర్ని దూరం చేస్తుంది.
 

సాన్నిహిత్యం తగ్గడం

ఒత్తిడి సంబంధంలో శారీరక, భావోద్వేగ సాన్నిహిత్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆప్యాయత, సెక్స్ లో పాల్గొనడం తగ్గడం లేదా సాన్నిహిత్యం లేకపోవడం వంటివి ఒత్తిడిని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

విమర్శలు పెరగడం

మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు మీ భాగస్వామిని మరింత విమర్శించొచ్చు. ఒత్తిడి మీ సంబంధంలో ప్రతికూల లేదా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది తరచుగా గొడవలు, కొట్లాటలకు దారితీస్తుంది. 
 

మద్దతు లేకపోవడం

మీ భాగస్వామి ఒత్తిడితో ఉన్నప్పుడు వారికి మీ భావోద్వేగ మద్దతు చాలా చాలా అవసరం. ఇది ఇవ్వకపోతే ఉన్న ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఒంటరి ఫీలింగ్ ను కలిగిస్తుంది. అలాగే మీ ఒత్తిడి స్థాయి మరింత పెరుగుతుంది. 
 

Latest Videos

click me!