లేట్ గా పెళ్లి చేసుకుంటే జరిగేది ఇదే..!

First Published Feb 24, 2024, 9:50 AM IST

ఒకప్పుడు పెళ్లీడు రాగానే పెళ్లిపీఠలు ఎక్కేవారు. కానీ ఇప్పుడు సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. చాలా మంది 30 ఏండ్లు దాటిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ లేట్ గా పెళ్లి చేసుకుంటే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు. 
 

పెళ్లి ఇప్పుడే చేసుకోవాలి.. అప్పుడే చేసుకోవాలనేం లేదు. ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్లు, చుట్టాలు, తెలిసిన వాళ్లంతా ఇంకెప్పుడు పెళ్లి అని ఒత్తిడి తెస్తుంటారు. ఇది చాలా కామన్ విషయం. ఇకపెద్దలైతే లేట్ గా పెళ్లి చేసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయని తొందరగా చేసుకోమని సలహానిస్తుంటారు. దీనివల్ల కొంతమంది అయితే తొందర తొందరగా పెళ్లి చేసుకుంటారు. కానీ చిన్నవయసులో పెళ్లి చేసుకోవడం వల్ల నిజంగానే సమస్యలు వస్తాయి. అలాగే గని లేట్ వయసులోనే పెళ్లి చేసుకోవాలని కాదు. కానీ లేట్ మ్యారేట్ వల్ల మాత్రం కొన్ని లాభాలు ఖచ్చితంగా ఉంటాయంటున్నారు నిపుణులు. అవేంటంటు? 

స్వయం సమృద్ధి 

పెళ్లి తర్వాత బరువు, బాధ్యతలు పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తొందరగా పెళ్లి చేసుకోవడం వల్ల బాధ్యతలు మీదుంటాయి. దీనివల్ల మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరు.అలాగే పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోలేరు. అదే లేట్ గా పెళ్లి చేసుకోవడం వల్ల ఒకవ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడానికి, లక్ష్యాలను సాధించడానికి, ఆర్థికంగా ఎవ్వరిపై ఆధారపడకుంటా ఉంటారు. పెళ్లికి ముందే ఆర్థికంగా బలంగా ఉండటం చాలా అవసరం. పెళ్లి తర్వాత డబ్బుల విషయంలో వేరేవాళ్లపై ఆధారపడితే అస్సలు బాగుండదు. 
 

marriage

పరిపక్వత 

లేట్ గా పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఇది చాలా ముఖ్యమైంది. ఒకవయసు వచ్చిన తర్వాత పరిపక్వత బాగా పెరుగుతుంది. దీనివల్ల మీకు, మీ భాగస్వామికి ఎలాంటి అవసరాలుంటాయి.. ఎలాంటి కోరికలు ఉంటాయని బాగా అర్థం చేసుకోగలుగుతారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది ఇద్దరి మధ్య గొడవలు వచ్చేలా చేస్తుంది. 
 

marriage

కోరికలు

చిన్న వయసులో  లేదా ఇంట్లో వారి బలవంతంపై పెళ్లి చేసుకుంటే మీరు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు కోరికలేంటి? మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారో.. అవన్నీ మీ నుంచి దూరమవుతాయి. అదే  మీరు కాస్త ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల మీ కోరికలను, కలలను నేర్చుకోవడానికి మీకు తగిన టైం లభిస్తుంది. 
 

ట్రావెలింగ్

ప్రతి ఒక్కరికీ.. కొన్ని ప్లేస్ లకు వెళ్లి చూడాలనే కోరిక అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి కోరికను పెళ్లికి ముందు తీర్చుకోవడం మంచిది. పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. అయినా పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి ట్రావెల్ చేయొచ్చు. కానీ పెళ్లికి ముందే ఇవి చూసేయాలి అని అనుకునేవారు ఉన్నారు. పెళ్లికి ముందు ట్రావెల్ చేస్తే మీకు నచ్చినవన్నీ చూసేయొచ్చు. అలాగే మీకు చాలా సమయం కూడా ఉంటుంది. 
 

ఆర్థిక స్థిరత్వం

తొందరపడి పెళ్లి చేసుకోవడం వల్ల కెరీర్ ను మరింత మెరుగ్గా స్థిరపరుచుకునే సమయం చాలా వరకు మీకు దొరకదు. ఎందుకంటే అప్పటి బాధ్యతలు మీపై చాలానే ఉంటాయి. అందుకే  మీరు ఆర్థికంగా మెరుగ్గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోండి. దీంతో మీకు పెళ్లి తర్వాత డబ్బుకు సంబంధించిన సమస్యలేం రావు. 
 

Marriage


సంబంధాలు బలంగా ఉంటాయి 

ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం వల్ల మీ పరిపక్వత పెరుగుతుంది. అన్ని పాజిటీవ్ గానే ఆలోచిస్తారు. ఇద్దరు ఎలా ఉండాలి? ఏం చేయొద్దు? ఏం చేయాలి? అన్ని విషయాలన్నీ తెలుస్తాయి. పెళ్లి తర్వాత ఎలా ఉండాలన్న దానిపై మీకు ఒక అవగాహన వస్తుంది. ఇది సంబంధంలో పరస్పర అవగాహన, గౌరవాన్ని కూడా పెంచుతుంది. దీంతో మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు, కొట్లాటలు జరగవు. 
 

marriage

పిల్లల పెంపకం

లేట్ గా పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్నో విషయాల్లో అవగాహన పెరుగుతుంది. వీళ్లకు పరిపక్వత, ఆర్థిక స్థిరత్వం కూడా ఎక్కువగా ఉంటాయి. వీళ్లు తల్లిదండ్రులు అయినప్పుడు వారి పిల్లలను బాగా పెంచగలుగుతారు. పిల్లల ప్రతి అవసరాన్ని తీరుస్తారు. పెంపకం కూడా బాగుంటుంది.
 

click me!