ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని కొనసాగించడానికి కొన్ని చిట్కాలను ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా మీరు తినే ఆహారాలు, తాగే పానీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి తిన్న తర్వాత అజీర్ణం, ఉబ్బరం, చికాకును కలిగించే ఆహారాలు చాలానే ఉన్నాయి. దీని ప్రభావం సెక్స్ లైఫ్ పై కూడా కనిపిస్తుంది. కడుపు నిండుగా అనిపించడం, ఉబ్బరం వంటి కారణాల వల్ల సెక్స్ డ్రైవ్ బాగా తగ్గుతుంది. ఇది లిబిడోను కూడా ప్రభావితం చేస్తుంది. తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా లిబిడోను కూడా పెంచుతుంది. అయితే లైంగిక కార్యకలాపాల్లో చురుగ్గా ఉండేందుకు మీరు సెక్స్ కు ముందు కొన్ని ఆహారాలను అసలే తినకూడదు.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. పోషకాల లోపం కారణంగా చాలా మంది వంధ్యత్వం, అంగస్తంభనతో బాధపడుతున్నారు. జర్నల్ ఆఫ్ బాడీ లాజిక్ ప్రకారం.. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఆహారాలు గుండె జబ్బులకు కారణమవుతాయి. అలాగే ఇవి అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఈ కారణంగా లైంగిక అవయవాలలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీనివల్ల మీరు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనలేరు.
శృంగారానికి ముందు ఆహారం విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి?
నిపుణుల ప్రకారం.. సెక్స్ కు ముందు నీళ్లు లేదా ఇతర ద్రవాలను తీసుకోకూడదు. ఎందుకంటే ఇది మూత్ర విసర్జనను పెంచుతుంది. అలాగే పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయి తగ్గుతుంది. నిజానికి శక్తి అంతా జీర్ణవ్యవస్థ వైపు వెళుతుంది. ఇది మీకు నిద్రవచ్చేలా చేస్తుంది. శృంగారానికి ముందు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. బాదం, పాలు తీసుకోవడం వల్ల సెక్స్ లైఫ్ ఎనర్జిటిక్ గా, హ్యాపీగా ఉంటుంది. మరి సెక్స్ కు ముందు ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
స్పైసీ ఫుడ్
సెక్స్ కు ముందు స్పైసీ ఫుడ్ ను తినడం మానుకోండి. చట్నీ, ఊరగాయలు, ఎర్ర మిరపకాయలు వంటి మసాలా వంటకాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వస్తుంది. దీంతో కడుపునొప్పి, గొంతునొప్పి సమస్య పెరుగుతుంది. అలాగే డీహైడ్రేషన్ రిస్క్ కూడా ఉంది. అంతేకాకుండా వేయించిన ఆహారాన్ని తినడం వల్ల ఎసిడిటీ ప్రమాదం కూడా పెరుగుతుంది.
పుదీనా
నోటి దుర్వాసనను పోగొట్టుకోవడానికి చాలా మంది సెక్స్ కు ముందు పుదీనాను ఎక్కువగా తింటుంటారు. కానీ ఇది లిబిడోను తగ్గించడం ప్రారంభిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. పుదీనాలో ఉండే మెంతోల్ టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఇది సెక్స్ డ్రైవ్ ను తగ్గిస్తుంది. 2010 పరిశోధన ప్రకారం.. 42 మంది మహిళలు పుదీనా మూలికా టీని 30 రోజులు నిరంతరం తాగారు. దీనివల్ల వారి టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గాయని కనుగొన్నారు.
స్టార్చ్ ఎక్కువగా ఉండే పిండి పదార్థాలు
పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే పిండి పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ తో పాటుగా గుండె జబ్బులు కూడా వస్తాయి. అంతేకాదు ఇవి మీ బరువును కూడా పెంచుతాయి. ఎన్ఐహెచ్ పరిశోధన ప్రకారం.. శృంగారానికి ముందు పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే పిండి పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది. అలాగే నిద్ర సమస్యను ఫేస్ చేయాల్సి వస్తుంది.
మద్యపానం
క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. హార్మోన్ల అసమతుల్యత లిబిడోను ప్రభావితం చేస్తుంది. బీఎంజే ఓపెన్ పరిశోధన పత్రం ప్రకారం.. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల వీర్యం పరిమాణం తగ్గుతుంది. హార్మోన్ల అసమతుల్యత తగ్గాలంటే మందును మానేయడం మంచిది.
కెఫిన్
శృంగారానికి ముందు టీ లేదా కాఫీ తాగే వారు కూడా ఉన్నారు. కానీ దీనివల్ల తరచుగా మీరు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇది లైంగిక ఆనందానికి ఆటంకం కలిగిస్తుంది. అలాగే కార్బోనేటేడ్ పానీయాలను తాగడం వల్ల కూడా కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది.