స్వీయ లైంగిక ఆనందాన్ని పొందడానికి చాలా మంది హస్తప్రయోగం చేస్తుంటారు. అలాగే సెక్స్ టాయ్స్ ను, వైబ్రేట్లను కూడా ఉపయోగిస్తుంటారు. ఇది మంచి లైంగిక ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ వీటిని సరిగ్గా ఉపయోగించకపోతే మాత్రం మీకు లైంగిక సంక్రమణ వ్యాధులొచ్చే ప్రమాదం చాలా ఉంటుంది. అందుకే వీటిని సురక్షితంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. మరి వైబ్రేటర్లను ఉపయోగించేవారు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వైబ్రేటర్ మోడల్
మార్కెట్లో ఎన్నో రకాల వైబ్రేటర్లు ఉంటాయి. ఇవి వివిధ ఆకారాలు, సైజుల్లో ఉంటాయి. కానీ మీ ఆకారం, సైజును బట్టి వైబ్రేటర్ ను కొనాలి. తొందరపాటుతో ఏదో ఒకటి కొనేయకండి. ఆ తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే మీ కంఫర్ట్, సేఫ్టీని బట్టి వీటిని కొనండి. మీకు అసౌకర్యంగా అనిపించేదాన్ని కొనకండి. ఎందుకంటే ఇది ఇబ్బందిని కలిగిస్తుంది. అందుకే మీ సౌలభ్యాన్ని బట్టి వైబ్రేటర్ ను కొనండి.
వైబ్రేటర్ రకం
మీరు కొన్న వైబ్రేటర్ మెడికల్-గ్రేడ్ సిలికాన్, బోరోసిలికేట్ గ్లాస్, స్టెయిన్లెస్ స్టీల్ లేదా అల్యూమినియం వంటి లోహాల వంటి పోరస్ కాని పదార్థాలతో తయారుచేయబడిందని నిర్ధారించుకోండి. కొన్ని రకాల వైబ్రేటర్ పదార్థాలు మనకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే వైబ్రేటర్ ను ఉపయోగించడం వల్ల వాటిలో బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి మీ శరీరానికి అంటుకుంటాయి.
సూచనలను చదవండి
మీరు వైబ్రేటర్ ను ఉపయోగించే ముందు.. దాని ప్యాకేజింగ్ పై రాసిన సూచనలను ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే వాటిని ఎలా ఉపయోగించాలని పూర్తి ఇన్ఫర్మేషన్ దానిపై ఉంటుంది. అలాగే ఇప్పటికే వైబ్రేటర్ ను ఉపయోగించేవారు ఎవరైనా తెలిసుంటే.. వారిని అడిగి సలహా తీసుకోండి.
క్లీనింగ్
వైబ్రేటర్ వల్ల మీకు ఎలాంటి సమస్యలు రాకూడదన్నా.. వాటిని ఉపయోగించిన తర్వాత ఖచ్చితంగా క్లీన్ చేయాలి. అలాగే వీటిని ఉపయోగించే ముందు కూడా ఖచ్చితంగా క్లీన్ చేయాలి. దీన్ని క్లీన్ చేయకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో క్లీనింగ్ ను మాత్రం మర్చిపోకండి.
షేరింగ్ వద్దు
చాలా మంది వైబ్రేటర్ ను శుభ్రం చేసి వేరేవాళ్లు వాడటానికి ఇస్తుంటారు. కానీ షేరింగ్ అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తుంది. ముఖ్యంగా ఇది లైంగిక సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా లైంగిక సంక్రమణ, ఎస్టీఐల వంటి ప్రమాదకరమైన సమస్యలకు దారితీస్తుంది. అందుకే మీ వైబ్రేటర్ ను ఎవరితోనూ పంచుకోకండి.