Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భార్యా భర్తలు ఎప్పుడు శత్రువులుగా మారుతారో తెలుసా?

Published : Apr 08, 2025, 10:00 AM IST

ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త. ఆయన చెప్పిన నీతి సూత్రాలు మానవ జీవితాలకు మార్గదర్శకాలుగా ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది వాటిని నమ్ముతారు. ఆచరిస్తారు. చాణక్యుడు పెళ్లి, భార్యా భర్తల బంధం గురించి చాలా విషయాలు చెప్పాడు. భార్యా భర్తలు ఎలా ఉంటే జీవితాంతం సంతోషంగా ఉంటారో? ఎలా ఉంటే ఒకరికొకరు శత్రువులుగా మారుతారో తన బోధనల్లో వివరించాడు. చాణక్యుడి ప్రకారం భార్యా భర్తలు ఎలాంటి పరిస్థితుల్లో ఒకరికొకరు శత్రువులుగా మారుతారో ఇక్కడ చూద్దాం.

PREV
16
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భార్యా భర్తలు ఎప్పుడు శత్రువులుగా మారుతారో తెలుసా?

ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు. ఆయన చెప్పిన నీతి సూత్రాలు చాలా ఫేమస్. మనుషులకు ఉపయోగపడే ఎన్నో నీతి సూత్రాలను ఆయన బోధించాడు. చాణక్యుడి ప్రకారం భార్యా భర్తలు ఎలాంటి సందర్భంలో శత్రువులుగా మారుతారో ఇక్కడ తెలుసుకుందాం.

అవగాహన లోపం: 

ఒకరినొకరు అర్థం చేసుకునే సామర్థ్యం, పరిణితిపై భార్యాభర్తల సంబంధం ఆధారపడి ఉంటుంది. సమన్వయం లేని ఇళ్లల్లో గొడవలు సహజం. దీనివల్ల భార్యా భర్తలు శత్రువులుగా మారే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు.
 

26
దుష్ట బుద్ధి:

ఆచార్య చాణక్యుడి ప్రకారం భార్య దుష్ట స్వభావం కలదైతే ఆమె అంటే భర్తకు ఇష్టం ఉండదు. భర్తకు ఇష్టం లేని పనులు చేయడం, పరాయి పురుషుల వైపై ఆకర్షితురాలైతే, ఆమెకు భర్తే శత్రువు అవుతాడని చాణక్య నీతి చెబుతోంది.

36
అప్పులు చేసే భర్త

చాణక్య నీతి ప్రకారం భర్త మితిమీరిన అప్పులు చేస్తే అతనే భార్యకు మహా శత్రువు అవుతాడు. అలాంటి వారు తాళిబొట్టును కూడా తాకట్టు పెడతాడని చాణక్యుడు పేర్కొన్నాడు.

 

46
తాగుబోతు భర్త

చాణక్య నీతి ప్రకారం తాగుబోతు భర్త.. భార్యకు శత్రువుగా మారతాడట. తాగి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా, భార్యను కూడా కొట్టవచ్చు. అలాంటి వాడి భార్య జీవితం నరకమే అంటాడు చాణక్యుడు.

56
భార్యా భర్తలు దుష్టులైతే?

భార్యా భర్తలు ఇద్దరూ చెడ్డ వారైతే.. ఇద్దరూ గొడవ పడాల్సి వస్తుంది. భార్య చేసే తప్పులకు భర్త, ఆయన చేసే తప్పులకు భార్య శిక్ష అనుభవించాల్సి వస్తుందని చాణక్యుడి బోధనల్లో పేర్కొన్నాడు.

66
దురాశ కలిగిన భర్త

చాణక్య నీతి ప్రకారం దురాశ కలిగిన భర్త ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తాడు. డబ్బు ఉంటే చాలు అనుకుంటాడు. భార్య డబ్బు అడిగితే శత్రువులా చూస్తాడు. దానధర్మాలు వ్యర్థం అంటాడు.

Read more Photos on
click me!

Recommended Stories