సాధారణంగా మగవాడి చూపులు ఎప్పుడు పరాయి స్త్రీ మీదే ఉంటాయి కాకపోతే కొందరు బయటపడతారు కొందరు బయటపడరు. కానీ పెళ్లి అయ్యాక కూడా పక్కవాడి భార్య మీద కన్నేసాడంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అవేంటో చూద్దాం అలాగే పరిష్కారాలు ఏంటో కూడా తెలుసుకుందాం.
సహజంగానే ఒక స్త్రీ మగవాడిని ఆకర్షిస్తుంది. మీ భర్త అలా పరాయి స్త్రీ లోనవుతున్నాడు అంటే మీలో ఆకర్షణ తగ్గిందేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. పిల్లల ధ్యాసలో పడి మీ ఆకర్షణ శక్తిని కోల్పోకండి.
అలాగే పక్కత్రీ మీద వ్యామోహం పెంచుకోవడానికి మరొక కారణం వైవాహిక జీవితం మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా వైవాహిక జీవితం లేనప్పుడు కొంత ఫ్రస్టేషన్ కి గురవడం సహజమే. అలాంటప్పుడే ఈ ఎక్స్పెక్టేషన్ ని వేరే దగ్గర తీర్చుకోవాలని చూస్తాడు. అలాగే ఎంతకూ తృప్తి లేకపోవడం వలన కూడా మగవాళ్ళు పక్క చూపులు చూస్తారు.
తన భార్యలో తనకి కావలసిన అన్ని క్వాలిటీస్ ఉంటాయి. అయినా పక్కవాడి భార్యలో ఇంకేదో క్వాలిటీ కనబడుతుంది. ఆ క్వాలిటీ కోసం పక్క వాడి భార్య మీద కన్నెస్తాడు. ఇలాంటి వాళ్లని ఎంత తృప్తి పరిచినా గారికి తెచ్చుకోలేము. అలాగే భార్య తీరుపై అసంతృప్తి కూడా భర్తని మరోవైపు చూసేలాగా చేస్తుంది.
తన భార్య తనని అర్థం చేసుకోవడం లేదని, తనకి నచ్చినట్లుగా మసులుకోవటం లేదని ఏవేవో కారణాలు చెప్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన కారణం నిజమైతే మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి ప్రయత్నించండి. లేదంటే మీ పరిస్థితి అతనికి వివరించండి.
అలాగే భర్తకి అవసరమైన శారీరక సుఖం ఇవ్వకపోయినా మగవాడి కన్ను మరో ఆడదాని మీద పడుతుంది కాబట్టి. ఆ విషయంలో కూడా మీ వల్ల ఏదైనా తప్పు ఉంటే సర్థి చెప్పండి లేదంటే మీలో లోపం ఉంటే మీ ప్రవర్తన మార్చుకోండి. లేదంటే రిలేషన్ ఎక్స్పర్ట్స్ సలహా తీసుకోండి.