సెక్స్ తర్వాత కాళ్లు పైకెత్తితే ప్రెగ్నెన్సీ తొందరగా వచ్చే అవకాశముందా?

First Published | Aug 13, 2023, 9:46 AM IST

ప్రస్తుత కాలంలో మహిళలు, పురుషులు ఇద్దరూ వ్యంధ్యత్వం సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే? 
 

పెళ్లి తర్వాత త్వరగా గర్భం దాల్చాలనుకునే జంటలు చాలానే ఉన్నాయి. కానీ కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా గర్భం మాత్రం దాల్చలేకపోతుంటారు. అయితే సెక్స్ తర్వాత ఆడవాళ్లు కాళ్లు లేపి కొద్దిసేపు ఉంటే గర్భం దాల్చే అవకాశం ఉందన్న అపోహ ఉంది. ఇది గర్భధారణ అవకాశాలను పెంచుతుందని నమ్ముతారు. మరి దీనిలో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

నిపుణుల ప్రకారం.. వీర్యం యోనిలోకి విడుదలైన తర్వాత మీ కాళ్ళను పైకి లేపడం అంటే గురుత్వాకర్షణ అండాశయం గుండా స్పెర్మ్ వెళ్లడానికి సహాయపడుతుంది. గర్భాశయం గుండా ప్రయాణించే స్పెర్మ్ మొత్తాన్ని పెంచగలిగితే గర్భం దాల్చే అవకాశం ఉంది. వీర్యాన్ని గుడ్లతో కలపడం ద్వారా ఇది గర్భధారణకు దారితీస్తుంది. 
 


అయితే ఇది గురుత్వాకర్షణతో సంబంధం లేకుండా ఇది స్పెర్మ్ పునరుత్పత్తి వ్యవస్థకు ప్రయాణించేలా చేస్తుంది. అలాగే కొన్ని స్పెర్మ్ కణాలు రెండు నిమిషాల్లో ఫెలోపియన్ ట్యూబ్లోకి చేరుతాయి. కాబట్టి కాళ్లు ఎత్తడం వల్ల ఎలాంటి తేడా ఉండదు.
 

త్వరగా గర్భం పొందడం ఎలా?

మీరు నిజంగా గర్భం ధరించాలనుకుంటే.. అండోత్సర్గము సమయంలో సెక్స్ చేయడానికి ప్రయత్నించండి. ఇది తప్పనిసరిగా రుతుస్రావం ప్రారంభానికి 12-14 రోజుల ముందు జరుగుతుంది. 28 రోజుల పీరియడ్ సమయమున్న మహిళల విషయంలో ఇది 14 వ రోజు జరుగుతుంది. అలాగే అండోత్సర్గము సమయంలో సెక్స్ ఫ్రీక్వెన్సీని పెంచడం వల్ల కూడా గర్భం దాల్చే అవకాశం ఉంది.  ఎందుకిలా ఉంటుందంటే? వీర్యం స్త్రీ పునరుత్పత్తి మార్గంలో 3-5 రోజులు వరకు జీవించే ఉంటుంది. కాబట్టి తరచూ సంభోగంలో పాల్గొంటే వీర్యకణాలు, అండాలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 

pregnancy

మీరు గర్భందాల్చడానికి సహాయపడే మరికొన్ని చిట్కాలు 

ధ్యానం, వ్యాయామం లేదా మరేదైనా మార్గం సహాయంతో మీ ఒత్తిడి స్థాయిలను నియంత్రించడానికి ప్రయత్నించండి. ఒత్తిడి కూడా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.

ఆల్కహాల్, సిగరెట్లకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి మీ గర్భధారణ అవకాశాలను తగ్గిస్తాయి.

ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి రెండింటినీ కలిగున్న ప్రినేటల్ విటమిన్లు పుష్కలంగా తీసుకోండి. 

ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండండి.

పీరియడ్ ట్రాకర్ తో అండోత్సర్గమును ట్రాక్ చేయండి.

మీ సంతానోత్పత్తి కాలంలో సంభోగం ఫ్రీక్వెన్సీని పెంచండి.

Latest Videos

click me!