కౌగిలింత ఇంత పని చేస్తుందా?

First Published | Feb 11, 2024, 1:16 PM IST

Hug Day 2024: ఫిబ్రవరి 12న హగ్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమించిన వారిని లేదా భార్యాను లేదా భర్తను కౌగిలించుకోవాలనే కోరిక చాలా మంది ఉంటుంది. ఈ కౌగిలింత మీ మధ్యన ప్రేమను పెంచడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. వాలెంటైన్స్ వీక్ లో జరుపుకునే హగ్ డే వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

కౌగిలి ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో. కౌగిలింత ఒక మధురమైన అనుభూతి. దీని ద్వారా మీరు మీ ప్రేమను, అనుబంధాన్ని మీరు ప్రేమించిన వారు అనుభూతి చెందేలా చేయొచ్చు. కానీ కౌగిలింత ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుందన్న ముచ్చట మీకు తెలుసా? అవును కౌగిలింత మీ శరీరంలో ఎన్నో రకాల సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది మనస్సును సంతోషంగా ఉంచుతుంది. అలాగే మిమ్మల్ని రిలాక్స్ చస్తుంది. అంతేకాదు వెచ్చని కౌగిలి మీ ఒత్తిడి కూడా ఇట్టే తగ్గించేస్తుంది. ఎన్నో రోగాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
 

వాలెంటైన్ వీక్ లో ఫిబ్రవరి 12న హగ్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు మీరు మీ భాగస్వామిని మాత్రమే కాదు ఆప్యాయంగా తల్లిదండ్రులను, పిలల్లనుసోదరి, సోదరుడు, మీ పెంపుడు జంతువులను కూడా కౌగిలించుకోవచ్చు. మీ ప్రేమను చూపించొచ్చు. మరి కౌగిలి శరీరానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


కౌగిలింత వల్ల శరీరంలో ఈ 3 హార్మోన్లు విడుదల అవుతాయి

డోపామైన్:- ఈ హార్మోన్ మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

సెరోటోనిన్: ఈ హార్మోన్ ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఇది మీ మూడ్ ని బాగా ఉంచుతుంది.

ఆక్సిటోన్: ఈ హార్మోన్ ను లవ్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ హార్మోన్ గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

Hug Day 2024

కౌగిలించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది

కౌగిలింత ప్రేమ భావన మాత్రమే కాదు.. ఇది మీ మానసిక స్థితిని కూడా చక్కగా ఉంచుతుంది. ఎవరైనా.. ఏ విషయం గురించైనా కలత చెందుతుంటే వారిని ఆప్యాయంగా కౌగిలించుకోండి. ఇధి వారి ఉద్రిక్తతను, ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. కౌగిలించుకోవడం వల్ల పైన చెప్పిన విధంగా హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయి.
 

Hug Day 2024

ఒత్తిడి పోతుంది

కౌగిలించుకోవడం వల్ల ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది. నిజానికి కౌగిలింతతో మీ ఒత్తిడిని పెంచే కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది. దీనిని ఒత్తిడి హార్మోన్ అని కూడా పిలుస్తారు. మీ కార్టిసాల్ పెరిగితే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల ప్రమాదం కూడా చాలా వరకు పెరుగుతుంది. 
 

రక్త ప్రసరణ మెరుగుపడుతుంది

కౌగిలింత శరీరంలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరుగుతుంది.

మెదడు పనితీరు మెరుగు 

కౌగిలించుకోవడం వల్ల మన జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇది శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గించడంతో పాటుగా మనస్సును పదునుగా చేస్తుంది.

Latest Videos

click me!