భావప్రాప్తి పొందాలనుకుంటే ఆడవాళ్లు ఈ తప్పులు చేయొద్దు..

First Published | Feb 9, 2024, 3:00 PM IST

ఆడవాళ్లతో పోలిస్తే మగవారే తొందరగా భావప్రాప్తిని పొందుతారు. కానీ ఆడవాళ్లు భావప్రాప్తి పొందడానికి చాలా సమయం పడుతుంది. అయితే బెడ్ రూం లో ఆడవాళ్లు చేసే కొన్ని తప్పుల వల్లే భావప్రాప్తిని పొందలేరని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 
 

సంభోగంలో పాల్గొన్నప్పుడు భావప్రాప్తి పొందడానికి చాలా మంది మహిళలు ఇబ్బంది పడతారు. అలాగే కొన్ని సమయాల్లో కొందరు మహిళలు శృంగారంలో పాల్గొన్నప్పుడు సుఖాన్ని అనుభవించరు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లు చేసే తప్పుల వల్లే భావప్రాప్తిని పొందలేరట. మరి ఆడవాళ్లు భావప్రాప్తి పొందడానికి ఏం తప్పు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మీ లుక్ గురించి ఆందోళన చెందడం

సాధారణంగా ఆడవాళ్లెప్పుడూ పర్ఫెక్ట్ గా కనిపించాలనుకుంటారు. కానీ ఇది ఎప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. సాన్నిహిత్యం, లైంగిక కార్యకలాపాల సమయంలో కూడా ఆడవాళ్ల మనస్సులో ఇది ఉంటుంది. దీని వల్ల ఆడవారు లైంగిక సుఖాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతుంటారు. చాలా మంది ఆడవారు తమ సన్నిహిత ప్రాంతం స్కిన్ టోన్ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. అలాగే సెక్స్ సమయంలో సౌకర్యవంతంగా ఉండలేకపోవడం వంటివి భావప్రాప్తికి ఆటంకం కలిగిస్తాయి. అందుకే ఆడవారు ఈ తప్పులు చేయకూడదు. 
 


మీ ఇష్టాయిష్టాలపై మౌనంగా ఉండటం

ఆడవాళ్లు తమ లైంగిక ఆనందం గురించి, ఇష్టా ఇష్టాల గురించి ఓపెన్ గా ఉండరు.  అలాగే తమకు ఏది ఆనందాన్ని ఇస్తుందనేది భాగస్వామికి చెప్పరు. ముఖ్యంగా సెక్స్ సమయంలో మీ భాగస్వామి చేసే ఏదైనా పని ఇబ్బంది కలిగిస్తే వెంటనే చెప్పేయండి. ఇలా చెప్పకపోతే కూడా మీరు భావప్రాప్తిని పొందలేరు. అలాగే మీరు లైంగిక భంగిమ లేదా ఏదైనా లైంగిక చర్యను ప్రయత్నించాలనుకుంటే దాని గురించి మీ భాగస్వామితో ఓపెన్ గా చెప్పేయండి. 
 

ప్రతిసారీ వారి చొరవ కోసం ఎదురు చూడటం

ఆడవాళ్లు ఎక్కువగా లైంగిక చర్య సమయంలో చొరవ అస్సలు తీసుకోరు. కానీ దీని వల్ల వీరు శృంగారాన్ని ఆస్వాదించలేరు. అందుకే ఆడవారు సెక్స్ సమయంలో కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి. ఇది ఆనందాన్ని పెంచుతుంది. అలాగే మీ భాగస్వామి కూడా శృంగారాన్ని బాగా ఆస్వాదిస్తారు. సెక్స్ ఒక పనేం కాదు. కాబట్టి దానిని స్వేచ్ఛగా ఆస్వాదించండి. 
 

ల్యూబ్ ఉపయోగించకపోవడం

లైంగిక కార్యకలాపాల సమయంలో ల్యూబ్ వాడకం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే ఆడవారు భావప్రాప్తికి చేరుకోవడాన్ని కూడా సులభం చేస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇది శృంగారాన్ని సులభతరం చేస్తుంది. ల్యూబ్ వాడకంతో సంభోగ సమయంలో మహిళలకు నొప్పి తగ్గుతుంది.
 

నకిలీ భావప్రాప్తి 

సెక్స్ సమయంలో ఆడవారు తమ భాగస్వామి సౌకర్యవంతంగా ఉండటానికి నకిలీ భావప్రాప్తిని పొందుతారు. అంటే భావప్రాప్తిని పొందకున్నా పొందినట్టే ప్రవర్తిస్తారు. కానీ ఇలా చేయడం తప్పు. మీరు మీ భాగస్వామిని సమర్థులుగా అనుకోవడం మానేసి వారికి అవకాశం ఇవ్వండి. దీంతో మీరు కూడా  లైంగిక ఆనందాన్ని పొందుతారు. దీని కోసం మీరు మొదటగా మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడాలి. అలాగే మీ ఆనందం గురించి మీ భాగస్వామితో మాట్లాడండి. 

Latest Videos

click me!