పెళ్లికి ముందు అబ్బాయిలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..!

First Published | Aug 27, 2022, 7:58 AM IST

పెళ్లి అనగానే... అందరూ  అమ్మాయిలకు ఇలా ఉండూ.. అలా ఉండూ అంటూ సలహాలు ఇస్తారు. అయితే... కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు... అబ్బాయిలు కూడా పెళ్లికి ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.

పెళ్లికి ముందు అమ్మాయి అయినా... అబ్బాయి అయినా.. చాలా కలలు, ఊహలు ఉంటాయి. తమ జీవితంలోకి వచ్చేవారు ఇలా ఉండాలి..  అలా ఉండాలి అని కలలు కంటూ ఉంటారు. అందులో ఆశ్చర్యకరమైన విషయమేమీ లేదు. ఈ విషయం పక్కన పెడితే.. పెళ్లి అనగానే... అందరూ  అమ్మాయిలకు ఇలా ఉండూ.. అలా ఉండూ అంటూ సలహాలు ఇస్తారు. అయితే... కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు... అబ్బాయిలు కూడా పెళ్లికి ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఓసారి చూద్దాం...
 


1.చాలా మంది ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత.. ఆ ప్రేమ చంపుకోలేక.. ఈ ప్రేమ పెంచుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే.. పెళ్లికి ముందు మీ ఫీలింగ్స్ ని మీరు ఎనలైజ్ చేసుకోవాలి. 


2.తమ జీవితంలోకి అడుగుపెట్టే అమ్మాయి వ్యక్తిత్వానికి గౌరవం ఇవ్వాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇద్దరి మధ్య ఏవైనా సమస్య వస్తే... వాటిని పరిష్కరించగలమనే నమ్మకం కలిగేలా ప్రవర్తించాలి.

3.దాదాపు అందరు అబ్బాయిలు.. తమ జీవితంలోకి వచ్చే అమ్మాయి.. అందరి పట్ల శ్రద్ధ వహిస్తూ... దయ తో ఉండాలని.. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే... మీరు కూడా అలా ఉండటం నేర్చుకోవాలి.

4.పెళ్లికి ముందు ప్రతి అబ్బాయి ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఆర్థిక పరిస్థితి. అవును.. మన ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది.. పెళ్లి చేసుకుంటే.. వచ్చే పరిస్థితులను తట్టుకోగలమా ఇలా అన్ని విషయాలను ఆలోచించిన తర్వాతే.. పెళ్లి వైపు అడుగువేయాలి.

5.కాస్త వింతగా అనిపించినా ఇది కూడా ముఖ్యం. పురుషులు పెళ్లి కి ముందే తమకు పిల్లలు పుట్టే సామర్థ్యం ఉందో లేదో తెలుసుకోవాలట. ఇది చాలా అవసరమట. దానికి సంబంధించిన మెడికల్ చెకప్ చేయించుకున్నా తప్పులేదని నిపుణుల వాదన.

6.పెళ్లికి ముందు అబ్బాయిలు తమ కుటుంబంతోనే ఉంటారు. అయితే.. పెళ్లి తర్వాత కేవలం భార్యతో విడిగా ఉండాల్సి వస్తే... అన్నీ రిసోర్సెస్ అందించగలరో లేదో కూడా ఆలోచించాలి.
 

7.ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. పెళ్లి బంధంతో ఒక్కటౌతారు. అయితే.. వారి అభిరుచులు భిన్నంగా ఉండొచ్చు. ఇద్దరి మధ్య కంపాటబులిటీ ఎంత ఉందో ముందే తెలుసుకోవడంలో తప్పు లేదు.
 

8. పెళ్లి అనేది జీవితంలో అతి పెద్ద కమిట్మెంట్. కాబట్టి... పెళ్లి బంధంలోకి అడుగుపెట్టే ముందు... మన ప్రయారిటీస్ ఏంటి అనే విషయం కచ్చితంగా ఆలోచించుకోవాలి. ఆ తర్వాతే అటుగా అడుగు వేయాలి.

Latest Videos

click me!