a
ఒక రిలేషన్ మనిషికి ఎంత మనోధైర్యాన్నిస్తుందో అదే రిలేషన్ ఆ మనిషి ని పాతాళానికి కూడా తొక్కేస్తుంది. ఒక చక్కని బంధమే మనిషికి బలము బలహీనత అలాంటి బంధం విషయంలో చాలా జాగ్రత్త పడటం మంచిది ఎందుకంటే మోసపోవాల్సి వచ్చినప్పుడు ఆ బంధం మనల్ని మానసికంగా శారీరకంగా కూడా చాలా నష్టపరుస్తుంది.
మీ రిలేషన్ బాగున్నప్పుడే మీ పార్టనర్ యొక్క ప్రవర్తనని ఒక గంట కనిపెట్టండి. ఈ విషయంలో అయినా పర్సనల్ స్పేస్ అనేది అవసరం ఉంటుంది అది దాటి అతిగా మన విషయాలలో జోక్యం చేసుకుంటూ ఉంటే కొద్ది రోజులకి మన స్పేస్ లో మనం లేకుండా పోతాము.
తమ గురించి అసలు ఏమీ చెప్పకుండా మీ గురించి అసలు పట్టించుకోకుండా ఉండే వారితో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీ గురించి పట్టించుకోని వ్యక్తి రేపు మీకు ఎమోషనల్ సపోర్ట్ గాని, ఫిజికల్ సపోర్టు గాని ఇచ్చే అవకాశం ఉండదు.
అలాగే చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా కోప్పడే వాళ్ళతో, అరిచి హంగామా చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో వారి కోపానికి మీ బంధం పెద్ద ప్రతిబంధకంగా మారవచ్చు.
అలాగే మిమ్మల్ని ఎక్కువగా అదుపాజ్ఞల్లో ఉంచుతూ తను గీసిన గీత దాటకూడదు. అంటున్న వ్యక్తి ఎప్పటికైనా మీకు చేటు తీసుకువస్తాడు. అలాగే నువ్వు నాకే సొంతం నా అనుమతి లేనిదే వేరే వాళ్ళతో మాట్లాడకూడదు..
అంటూ ముందరకాళ్ళకి బంధం వేసే వ్యక్తి కూడా భవిష్యత్తులో మీ స్వేచ్ఛని హరించి వేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన చేతనైతే మార్చుకోగలగాలి లేదంటే వారిపై ఎక్కువగా ఎఫెక్షన్ పెంచుకోకుండా ఉండాలి.