అతిగా ఆవేశపడే భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తే కుటుంబం సుఖంగా ఉంటుంది?

First Published | Dec 23, 2021, 11:55 AM IST

ఏ బంధంలో (Bonding) అయినా  ప్రేమ (Love) ఆప్యాయతలనేవి చాలా ముఖ్యం. బంధంలో పరస్పర ప్రేమానురాగాలు ఉన్నప్పుడే బంధం ముందుకు సాగుతుంది. ఏ బంధంలోనైనా చిన్న చిన్న సమస్యలు సర్వసాధారణం. ఆ సమస్యలన్నింటిని సామరస్యంగా చక్కగా పరిష్కరించుకుంటూ బంధాన్ని బలపరచుకొనేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలి. 

అప్పుడే ఆ బంధంలో ఎటువంటి అపోహలు చోటు చేసుకోవు. వివాహ బంధంలో భాగస్వామి అతిగా ఆవేశపడే వారు అయితే వారితో వ్యవహరించడం చాలా కష్టం. అలా అని వారితో వాదిస్తూ చిన్న సమస్యలను పెద్దగా మార్చరాదు. అతిగా ఆవేశపడే భాగస్వామితో వ్యవహరించడానికి కొన్ని నియమాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

కాలంతోపాటు బంధాలలో మార్పులు కారణంగా బంధాలు బలహీనపడుతున్నాయి. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా మారి బంధాలు విడిపోవడానికి దారితీస్తున్నాయి. దీనికి కారణం అందులో ముఖ్యమైంది ఒక వ్యక్తి అతిగా ఆవేశపడటం (Overly excited), అతిగా స్పందించడం (Overreacting), అతిగా కోప్పడటం (Excessive irritability). ఇలా అతిగా ఆవేశపడే వ్యక్తి కారణంగా బంధం బలహీనపడుతోంది. అయితే ఇప్పుడు మనం అతిగా ఆవేశపడే వ్యక్తితో ఎలా నడుచుకోవాలో తెలుసుకుందాం..
 

Latest Videos


ఇలా అతిగా ఆవేశపడే వారు సహజంగా ఇతరులలో లోపాలు (Errors) వెతుకుతారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారిని మార్చడం కోసం వారు ఏమడిగినా సమాధానం చెప్పకపోవడం ఉత్తమం. ఎదుటివారిలో తప్పులను, లోపాలు వెతకడం వారి అలవాటు (Habit).
 

వారి ప్రవర్తన (Behavior) గురించి వారికి పూర్తిగా తెలియజేయడం అవసరం. వారిలోని అతి కోపం, అత్యావేశం కారణంగా ఇతరుల మనస్తత్వం (mentality) దెబ్బతింటుందని వారు మనసు మార్చుకుంటే బంధాలు బలంగా మారతాయని చెప్పాలి.
 

ఇతరులతో చర్చించేటప్పుడు (Discussing) వారికి ఏ విషయమైనా నచ్చకపోతే గట్టిగా అరుస్తుంటారు. ఇలా గట్టిగా అరవడం ఆరోగ్యానికి (Health) మంచిది కాదని చెప్పాలి. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండి ఎదుటి వారు చెప్పిన విషయాలను వినాలని, కోపంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదని తెలియజేయాలి.
 

అతి ఆవేశం, కోపంతో తీసుకునే నిర్ణయాలు (Decisions) భవిష్యత్తుకు మంచిది కాదని చెప్పాలి. వారు అతిగా ఆవేశపడడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి. ఏ సమస్య ఉన్న ప్రశాంతంగా సామరస్యంగా పరిష్కరించకుంటే (Resolved) బంధాలు పెరుగుతాయని వారికి అర్థమయ్యేలా వివరించాలి.
 

టాక్సిక్ ప్రవర్తన (Toxic behavior) కలిగి ఉన్న వ్యక్తులకు వారి టార్గెట్ (Target) ఎవరో బాగా తెలుసు. వారు కనిపిస్తే అరవాలి అని మనసులో లాక్ చేసి ఉంచుతారు. ఇలాంటి వారు మీ దగ్గరికి రాగానే పని ఉందని లేదా ఏదో సాకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోండి. వారు మీపై అరవాలన్న ప్రయత్నం నుంచి మీరు తప్పించుకోగలిగారు.
 

ఒక బంధంలో ప్రేమానురాగాలు (Affections) చాలా ముఖ్యమని వారికి తెలియజేయాలి. మీ అతిఆవేశం (Overzealous) మీ బంధం బలహీనపడడానికి కారణమవుతోందని తెలియజేయాలి. బంధానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థమయ్యేలా వివరించాలి.

click me!