ఈ ట్రిక్స్ పాతవే అయినా.. మీ ప్రేమను గెలిపిస్తాయి తెలుసా..!

First Published | Jun 5, 2022, 4:03 PM IST

నేటి యువత చాలా వేగంగా ఆలోచిస్తోంది. ప్రతి విషయంలోనూ ఒకే విధంగా ఉంటున్నారు. రిలేషన్ షిప్ లో కూడా. అయితే మన ఆలోచన విధానమే మన సక్సెస్ లేదా.. ఫెయిల్యూర్ కు కారణమవుతుంది. అయితే కొన్నిసార్లు మీ విధానం సరైనది కాకపోవచ్చు. దీనివల్ల మీ రిలేషన్ షిప్ విడిపోయే అవకాశం ఉంది. అందులో కొంతమంది తమకు ఇష్టమైన అమ్మాయి లేదా అబ్బాయికి తమ ప్రేమను తెలపడానికి వెనకాడుతుంటారు. అసలు ఎలా చెప్పాలి? ఎలా చెప్తే తమ లవ్ సక్సెస్ అవుతుంది అంటూ ఎన్నో విధాలుగా ఆలోచిస్తారు. నిజానికి మనం ప్రపోస్ చేసే విధానం కూడా మీ ప్రేమను సక్సెస్ చేస్తుంది. ఇంతకి ఎలా ప్రపోస్ చేస్తే మీ లవ్ సక్సెస్ అవుతుందో తెలుసుకుందాం పదండి.. 
 

చాలా మంది అబ్బాయిలు ఒక అమ్మాయిని ఇష్టపడినప్పుడు అది చెప్పడానికి మాత్రం వెనకాడుతుంటారు. అయితే మొదటి సారి డేట్ కు వెళ్లేటప్పుడు వివిధ రకాల ఖరీదైన బహుమతులను ఇచ్చి వారి ప్రేయసిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. కానీ అమ్మాయిలు ఇప్పటికీ పాతకాలపు ఆలోచనలనే ఇష్టపడతారు. కాబట్టి అందరు అమ్మాయిలు ఖరీదైన బహుమతులకు ఆకర్షితులవుతారని చెప్పలేము. ఈ తరం అమ్మాయిలను ఆకట్టుకోవడానికి పాతకాలపు ఉపాయాలే ఎక్కువగా ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 

డేటింగ్ ఎల్లప్పుడూ పెద్ద ఫ్యాన్సీ రెస్టారెంట్ లో జరగాల్సిన అవసరం లేదు. ఈసారి డేట్ కు వెళ్ళేటప్పుడు రెస్టారెంట్ ను బదులుగా కొంచెం భిన్నంగా ప్రయత్నించండి. స్టైలిష్,  ఖరీదైన రెస్టారెంట్ కు వెళ్లడానికి బదులుగా వారితో స్ట్రీట్ ఫుడ్ డేట్ కు వెళ్లండి.


అమ్మాయిలకు చిన్న చిన్న విషయాలంటే ఇష్టం. చాట్, పకోడీలు, గోల్-గప్పాలు, ఐస్ క్రీం లను ఇష్ఠపడని అమ్మాయిలు అసలే ఉండరు. మీరు వారిని ఆకర్షించడానికి పెద్ద రెస్టారెంట్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా మీరిద్దరూ సరదాగా గడపడానికి స్ట్రీట్ ఫుడ్ కు వెళ్లండి. ఇది చాలా సరదాగా కూడా ఉంటుంది. 

చేతితో రాసిన లేఖలు.. ప్రస్తుతం అనేక డేటింగ్ అప్లికేషన్లు ఉన్నాయి. మీ క్రష్ ను ఆకట్టుకోవడానికి అనేక మార్గాలు కూడా ఉన్నాయి. కానీ మీరు వాటి ద్వారా మీ లవ్ సక్సెస్ అవుతుంది అని చెప్పడం కాస్త సందేహమే. ఫోన్ మెసేజ్ రూపంలో మీ ఫీలింగ్స్ ను చెప్పే బదులుగా మీ చేతితో రాసిన కార్డు లేదా లేఖను వారికి పంపండి.

చేతితో రాసిన ఉత్తరాలు గుండెను హత్తుకుంటాయి. దీనిలో మనస్సులో ఉన్న ఫీలింగ్స్ అన్నింటినీ చెప్పొచ్చు.  అంతేకాక ఈ లేఖ మీ భాగస్వామిని త్వరగా ఆకట్టుకుంటుంది. మీ చేతితో మీ ప్రేమను వ్యక్తపరిస్తే వంద శాతం మీ లవ్ సక్సెస్ అవుతుంది. 

స్నేహితులను మర్చిపోవద్దు.. స్నేహితులు అంటే మీ స్నేహితులు కాదు. మీ గర్ల్ ఫ్రెండ్ స్నేహితుల గురించి. ఎందుకంటే నేటికీ అమ్మాయిలు తమ స్నేహితులకు ప్రతిదీ చెప్పి, వారి సలహా మేరకు నిర్ణయం తీసుకుంటారు. వారి స్నేహితుల గురించి తప్పుగా మాట్లాడినా..  జోక్ చేసినా.. అస్సలు సహించరు. మీరంటే ఉన్న ఇష్టం కాస్త పోతుంది. మీరు మీ ప్రేమలో సక్సెస్ కావాలంటే మీ గర్ల ఫ్రెండ్ స్నేహితులతో క్లోజ్ గా ఉండండి. ముందు వారి నమ్మకాన్ని గెలుచుకోండి. 

ఒక పాట పాడటం ద్వారా ఆకట్టుకోండి.. పాత సినిమాల్లో హీరో.. హీరోయిన్లను ఆకట్టుకోవడానికి పాటలు పాడేవారు. అమ్మాయిల పాటలను, కవితలను బాగా ఇష్టపడతారు. మీరు కూడా వారి గురించి ఒక కవితనో రాసి వారికి అంకితం చేయండి. మీపై వారికి ఎంతో ఇష్టం కలుగుతుంది.

శారీరక సంబంధం కోసం తొందరపడవద్దు:  మీరు వాళ్లను నిజంగా ప్రేమిస్తే.. ఈ విషయాన్ని మీ ప్రేయసికి తెలియజేయాలనుకుంటే అందుకోసం సమయాన్ని కేటాయించండి. ఈ విషయంలో వారిని శారీరక సంబంధంలోకి తీసుకురావడానికి తొందరపడకండి. వారికి దగ్గరగా ఉండటానికి సమయం తీసుకోండి. సమయం వచ్చినప్పుడు సమ్మతితో ముందుకు సాగండి.

Latest Videos

click me!