కరోనా నుంచి కోలుకున్న వెంటనే శృంగారం.. ప్రమాదమా?

First Published | Jul 27, 2020, 3:12 PM IST

కరోనా సోకిన వారి పరిస్థితి ఏంటి...? ఒక వ్యక్తి కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. మళ్లీ కలయికలో పాల్గొనాలంటే ఎంతకాలం వేచి ఉండాలి..?

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలోనూ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకీ తక్కువలో తక్కువ 50వేల కేసులు నమోదౌతున్నాయి. అయితే.. సంతోషించదగిన విషయం ఏమిటంటే.. మరణశాల శాతం తక్కువగా ఉండటమే.
undefined
ఈ వైరస్ ఎవరికి ఎలా వస్తుందో అసలు అర్థంకావడం లేదు. ఇప్పటివరకు కేవలం ముట్టుకున్నా.. తుమ్మినా, దగ్గినా ఇతరులకు పాకేస్తుందని అందరూ అనుకున్నాం. కానీ.. గాలిలోనూ కూడా పయనించి సోకుతుందని తాజాగా తెలిసింది. ఈ క్రమంలో ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాల్సిందే..
undefined

Latest Videos


అయితే.. ఈ వైరస్ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. శృంగారం వల్ల కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందా అనే అనుమానం చాలా మందిలో ఉంది. దీనిపై పలు సంస్థలు పలు పరిశోధనలు కూడా చేశాయి.
undefined
అయితే.. వారి పరిశోధనల్లో కొందరు శృంగారం వల్ల కరోనా రాదని తేల్చినా.. మరి కొందరు మాత్రం పురుషుల వీర్యంలో కరోనా వైరస్ ని కనుగొన్నామని చెబుతున్నారు.
undefined
అయితే... ఇప్పటి వరకు కరోనా రానివాళ్లే..దీని గురించి తెగ వెతికారు. మరి కరోనా సోకిన వారి పరిస్థితి ఏంటి...? ఒక వ్యక్తి కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. మళ్లీ కలయికలో పాల్గొనాలంటే ఎంతకాలం వేచి ఉండాలి..?
undefined
ఈ విషయంపై కూడా ఓ సంస్థ పరిశోధనలు చేసింది. వారి పరిశోధన ప్రకారం.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కనీసం 30 రోజలు వరకు శృంగారంలో పాల్గొనవద్దని నిపుణులు చెబుతున్నారు
undefined
అప్పటి వరకు శరీరంలో కరోనా వైరస్ కి సంబంధించిన ఆనవాళ్లు ఉండే అవకాశం ఉందని.. తద్వారా తమ భాగస్వామికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
undefined
థాయిలాండ్ లో దాదాపు 38మంది కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల వీర్యంపై ఈ మేరకు పరిశోధనలు చేశారు. వారిలో 16శాతం మంది వీర్యంలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు.
undefined
కోలుకొని దాదాపు నెల రోజులు గడిచిన వారిలో మాత్రం వైరస్ అవశేషాలు కూడా కనపడలేదని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి.. కనీసం ఒక నెల దూరంగా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.
undefined
నెల రోజులు ఆగిన తర్వాత కూడా కండోమ్ వాడకం మంచిదని చెబుతున్నారు. ఒక భాగస్వామికి కరోనా లక్షణాలు కనపడితే.. మీరు కూడా ముందస్తు జాగ్రత్తలో ఉండటం మంచిది.
undefined
కరోనా శృంగారం వల్ల రాదన్న విషయం మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి. ఒక వేళ మీ భాగస్వామికి కరోనా లక్షణాలు ఉంటే.. వారితో సన్నిహితంగా మెలగడం, ముద్దులు పెట్టుకోవడం వల్ల మీకు కూడా కరోనా వచ్చే అకవాశం ఉంది.
undefined
కరోనా లక్షణాలు ఉంటే మాత్రం శృంగారానికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముద్దులకైతే ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.
undefined
click me!