సేఫ్టీ లేకుండా ఫస్ట్ టైమ్ శృంగారం.. గర్భం వచ్చేస్తుందా..?

First Published Jul 25, 2020, 2:59 PM IST

గర్భనిరోధక విధానాలేవీ పాటించకుండా సెక్స్ లో ఎప్పుడు పాల్గొన్నా... అది మొదటిసారి కావొచ్చు... ఆ తర్వాతైనా కావొచ్చు.. ఎప్పుడైనా గర్భం వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
 

శృంగారం విషయంలో ఎవరీ పూర్తి అవగాహన ఉండదు. చాలా మంది సినిమాల్లో, వీడియోల్లో చూసి అదే నిజమని నమ్ముతుంటారు. చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. వాటిలో కొన్నింటికి నిపుణులు సమాధానం చెబుతున్నారు.
undefined
తొలిసారి కలయికలో పాల్గొంటే గర్భం రాదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే.... అలానే జరగాలని రూలేమీ లేదంటున్నారు నిపుణులు.
undefined
గర్భనిరోధక విధానాలేవీ పాటించకుండా సెక్స్ లో ఎప్పుడు పాల్గొన్నా... అది మొదటిసారి కావొచ్చు... ఆ తర్వాతైనా కావొచ్చు.. ఎప్పుడైనా గర్భం వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
undefined
వీర్యంలో చురుకైన, తగినన్ని శుక్రకణనాలున్న పురుషుడు శృంగారంలో పాల్గొని స్ఖలించినప్పుడు...అదే సమయంలె స్త్రీలు కూడా అండాల విడుదల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఆ కలయిక మొదటి సారి అయినా.. గర్భం వస్తుందని చెబుతున్నారు.
undefined
ఇంకొందరు గర్భం రాకుండా ఉండేందుకు ముందుగానే కండోమ్ వాడుతుంటారు. అయితే... కండోమ్ వాడటం కూడా చాలా మంది ఇష్టపడరు.
undefined
కండోమ్ ఉంటే ఆస్వాదించలేకపోతున్నామని చెబుతారు. అలాంటివారు స్ఖలనానికి ముందు అంగాన్ని బయటకు తీసేస్తారు. అలా చేయడం వల్ల గర్భం రాదని వారు భావిస్తుంటారు.
undefined
అలా చేయడం వల్ల కూడా కచ్చితంగా గర్భం రాదు అని చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. గర్భనిరోధం కోసం చాలా మంది ఈ పద్ధతిని కొనసాగిస్తుంటారు.
undefined
దీనికి వైద్య పరంగా కాయిటస్ ఇంటరప్టస్ అనే పేరు కూడా ఉంది. అయితే ఇది అంత మంచి గర్భనిరోధక విధానం కాదంటున్నారు.
undefined
ఎందుకంటే స్ఖలనం జరిగి వీర్యం బయటకు రావటమన్నది సంభోగం చివరే జరగొచ్చు గానీ... అంతకముందు సంభోగం కొనసాగుతున్నంతపేపు కూడా పురుషాంగం నుంచి కొన్ని స్రావాలు వస్తూనే ఉంటాయి.
undefined
ఈ స్రావాల ద్వారా కూడా కొన్ని శుక్రకణనాలు యోనిలోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ విధానాన్ని పూర్తిగా నమ్మలేమంటున్నారు.
undefined
పైగా భావప్రాప్తికి చేరువయ్యే సమయంలో పురుషుడు నియంత్రించుకోవడటం, సంభోగాన్ని ఆపెయ్యడమంటే అంత సులభంగా అయ్యేపని కాదు.. దాని వల్ల వారికి తృప్తి లభించదు. అందుకే ఈ విధానం నమ్ముకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.
undefined
click me!