కలయికలో ఎంతసేపు పాల్గొంటే మంచిది?

First Published | Dec 17, 2023, 3:08 PM IST

కలయిక వల్ల ఎన్నో మానసిక, శారీరక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చాలా మందికి ఎంత సేపు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే మంచిదనే సందేహాలు వస్తాయి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే?

Sex Life

రతిక్రీడ వల్ల స్త్రీ, పురుషులిద్దరికీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వారానికి రెండు, మూడు సార్లైనా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే గుండె జబ్బులు, ఇతర వ్యాధుల ముప్పు తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఎంత ఎక్కువ సేపు కలయకలో పాల్గొంటే అంత మంచిదనే సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. కానీ ఇది ఎంతకాలం కొనసాగుతుందనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఏదేమైనా తక్కువ సమయం లైంగిక కార్యకలాపాలు మాత్రం మంచి లైంగిక ఆనందాన్ని కలిగించవు. 
 

సాధారణంగా పురుషులు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్న 5-10 నిమిషాల తర్వాత స్ఖలనం చేస్తారని నిపుణులు చెబుతున్నారు. మరొక అధ్యయనం ప్రకారం.. 3 నుంచి 13 నిమిషాల పాటు శృంగారంలో పాల్గొనడం సాధారణం. మూడు నుంచి ఏడు నిమిషాల పాటు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే సరిపోతుందని మరో అధ్యయనం సూచిస్తోంది. అలాగే ఏడు నుంచి పదమూడు నిమిషాల మధ్య సంభోగం వాంఛనీయమైనదిగా గుర్తించబడింది.
 


మంచి కలయిక అంటే ఏమిటి?

ఎంత సేపు ఉన్నా మంచి కలయికను ఆస్వాదించొచ్చని నిపుణులు చెబుతున్నారు. మంచి లైంగిక ఆనందాన్ని ఆస్వాధించడానికి భాగస్వాములిద్దరూ దీని గురించి మాట్లాడుకోవాలి. అలాగే మరింత సమయాన్ని అడగండి. అంటే ఒకరి అవసరాలను మరొకరు తెలుసుకోవాలి. అలాగే మీ ఫాంటసీలను కూడా పంచుకోవచ్చు.
 

సెక్సువల్ ఎక్స్ పీరియన్స్

సెక్సువల్ ఎక్స్ పీరియన్స్ అంటే కేవలం కలయిక మాత్రమే కాదు..  కలయిక తర్వాత కౌగిలించుకోవడం ఎంత ముఖ్యమో ఫోర్ ప్లే కూడా అంతే ముఖ్యం. కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో సంతోషం కూడా అంతే ముఖ్యం. సెక్స్ సమయంలో మీ భావోద్వేగాలను వ్యక్తపరచాలి. 
 

ఎక్కువ సేపు కలయికలో పాల్గొనాలంటే? 

ఫోర్ ప్లే

ఫోర్ ప్లే మిమ్మల్ని లైంగికంగా ఉత్తేజపరుస్తుంది. ఇది కలయికకు ముందు జరిగే లైంగిక చర్య. ఇది మీ భాగస్వామితో భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. అలాగే మీ భాగస్వామిలో లైంగిక కోరికలను ప్రేరేపించడానికి కూడా సహాయపడుతుంది.

నెమ్మదిగా

కలయిక కఠినంగా, మొరటుగా ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని నెమ్మదిగా కూడా చేయొచ్చు. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనొచ్చు. అలాగే మీ సహనాన్ని కూడా పెంచుతుంది. కలయికలో ఎక్కువ సేపు ఉండాలంటే తగినంత శక్తి ఉండాలి.దీనికోసం మీరు రోజూ వ్యాయామం చేయండి. ఇందుకు కటి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి.
 

కలయిక ఎక్కువ సేపు కొనసాగితే ఏం జరుగుతుంది?

కలయికలో ఎంత ఎక్కువ సేపు పాల్గొంటే అంత మంచిదని చెప్తుంటారు. కానీ దీనిలో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. దీర్ఘకాలిక కలయిక యోని సంక్రమణకు దారితీస్తుంది. ఇది యోని నొప్పి, వాపునకు కూడా దారితీస్తుంది. ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటే లూబ్రికేటింగ్ ఆయిల్ ఎండిపోయి ఘర్షణకు కారణమవుతుంది. ఇది నొప్పికి దారితీస్తుంది. యుటిఐలకు కూడా ఎక్కువ ప్రమాదం ఉంది. ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటే శారీరక అలసట వస్తుంది.

Latest Videos

click me!