భార్యభర్తల మధ్య బంధం.. అన్యోన్యంగా ఉన్నప్పుడే.. వారి కాపురం సజావుగా సాగుతుంది. ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకుంటేనే కాపురం నిలపడుతుంది. అయితే.. పురుషుల్లో ఈ మధ్య కాలంలో ఏర్పడుతున్న కొన్ని సమస్యల కారణంగా భర్తలను భార్యలు అసహ్యించుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది.
undefined
పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ప్రస్తుత కాలంలో ఎక్కువయ్యాయనే చెప్పవచ్చు. అయితే.. ఈ అంగ స్తంభనను అంత తేలికగా తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు
undefined
దీని వల్ల ఇప్పటివరకు అనారోగ్య సమస్యలు మాత్రమే తలెత్తేవి. అయితే.. ఇప్పుడు ఇది కాపురాలను కూడా కూల్చేస్తోందని ఆలస్యంగా తెలిసింది.
undefined
అంగస్తంభన కారణంగా.. చాలా మంది పురుషులు కలయికలో ఫెయిల్ అవుతున్నారు. అటువంటి వారితో కలిసుండటం కష్టమేనని 30 శాతం మహిళలు అభిప్రాయపడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.
undefined
పురుషుల్లో 53 శాతం మందికి తమకు అంగస్తంభన సమస్య ఉందనే తెలియకపోగా.. కానీ 78 శాతం మంది మహిళలకు తమ భర్తలు ఎదుర్కొంటున్న ఆ సమస్యపై స్పష్టమైన అవగాహన ఉందని తేలింది.
undefined
అంగస్తంభన సమస్యపై ప్రజలకు ఎంతమేర అవగాహన ఉందో తెలుసుకోవడానికి ఆ సంస్థ సర్వే నిర్వహించింది.
undefined
దేశవ్యాప్తంగా 1042 మంది స్త్రీ, పురుషులతో పాటుగా 307 మంది యూరాలజిస్టులు, సెక్సాలజిస్టులు, కన్సల్టింగ్ ఫిజీషియన్లతో ఈ పరిశోధన నిర్వహించారు.
undefined
సతాయిస్తున్న అంగస్తంభన సమస్య గురించి భాగస్వామితో మనసు విప్పి చర్చించడం ఒక్కటే తమ భార్యతో బంధాన్ని బలోపేతం చేసుకునే మార్గమని 56 శాతం మంది పురుషులు భావిస్తున్నారు.
undefined
అయితే 30 శాతం మంది మహిళలు మాత్రం తమ భర్త సరైన చికిత్స తీసుకోకపోతే అతడి నుంచి దూరంగా ఉండడమే మంచిదని భావిస్తుండటం గమనార్హం.
undefined