భర్త భార్య మాట వినాలంటే ఏం చెయ్యాలి.. ఎలా ఉండాలి!

First Published Oct 31, 2021, 4:56 PM IST

భార్య భర్తల బంధం పవిత్రమైన బంధం. ఈ పవిత్ర బంధంలో భార్యాభర్తలు ఇద్దరూ సమానం (Equal). అయితే ఈ పవిత్ర బంధంలో ప్రతి భార్య తన భర్త తన మాట వినాలని కోరుకుంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా భర్త భార్య మాట వినాలంటే భార్య పాటించవలసిన కొన్ని సూత్రాల (Principles) గురించి తెలియజేయడం జరిగింది.
 

మొదటి భార్య భర్త మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భర్త ఇష్టాయిష్టాల (Likes) గురించి తనే స్వయంగా (Himself) అడిగి తెలుసుకోవాలి. భర్త మనసును తెలుసుకున్న భార్యకి భర్త ఇష్టాయిష్టాలు తెలుస్తాయి. ఈ విధంగా మీరు ఏ పని చేస్తే మీ భర్తకు నచ్చుతుందో లేదో మీకు తెలుస్తుంది.

భర్త భార్య మాట వినాలంటే తనను ప్రేమగా (Love) చూసుకోవాలి. భర్తను చంటిపిల్లాడిలా భావించి తన అవసరాలు తీర్చాలి. భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే తనకు నచ్చిన వంటలను చేసి తనకు ప్రేమతో వడ్డించాలి. ఇలా తనకు ఇష్టమైన అన్ని పనులను చిరునవ్వుతో (Smile) చేస్తూ తన మెప్పును పొందాలి. 

భర్త అభిప్రాయాలను గౌరవించాలి. తనను నలుగురిలోనూ చులకన (levity) చేసి మాట్లాడరాదు. తన గౌరవమే మీ గౌరవంగా భావించి ఆయన మాటలకు విలువ (Value) ఇవ్వాలి. అప్పుడు తనకు మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తన కుటుంబ సభ్యులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.

కుటుంబ సభ్యుల మాటలకు విలువ (Value) ఇవ్వాలి. భర్త కుటుంబ సభ్యులకు మీ మీద మంచి అభిప్రాయం ఉంటే అప్పుడు మీ భర్త మిమ్మల్ని మరింత ఇష్టపడుతారు. ఎదుటి వారి ముందు మీ కుటుంబ గౌరవాన్ని (Respect) కాపాడే ప్రయత్నం చేయాలి. అప్పుడే కుటుంబ సభ్యులు మీకు అన్ని విషయాల్లోనూ తోడుగా ఉంటారు.
 

భర్త చేసే పని చిన్నదైనా వారిని చులకనగా చూడరాదు. వారికి తగిన ప్రోత్సాహన్నిస్తూ (Encouragement) వారిని ముందుకు నడిపించాలి. వారి అన్ని కష్టసుఖాల్లో మీరు తోడు (Accompany) నీడై ఉండాలి. భర్తకు అనారోగ్యం చేసినప్పుడు తనపై చికాకు పడకుండా తనను చంటిపిల్లాడిలా భావించి తగిన సేవలు చేయాలి. 

ఇలా భర్త అన్ని కష్టాసుఖాలలో మీరు తనకు ధైర్యం చెబుతూ భర్త మన స్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు భర్త మీ ప్రేమను (Love) అర్థం చేసుకుంటాడు. మీరు తనపై చూపిస్తున్నా ఆప్యాయతకు (Affection) ముగ్ధుడై పోతాడు. మీ మాటలను, అభిప్రాయాలను గౌరవిస్తాడు.  
 

మీ ఇద్దరి దాంపత్య జీవిత రహస్యాలను ఇతరులతో  చెప్పరాదు. మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగితే వాటిని వెంటనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి (Solving) మీ భర్త మీ పై ఎందుకు చికాకు పడుతున్నాడో దానికి తగిన కారణాలను తెలుసుకోవాలి. అనుకున్న పని ఒత్తిడిని (Stress) తగ్గించడానికి ప్రయత్నించాలి.
 

అంతేకానీ మీరు తన పై మరింత చికాకు (Irritation) చూపించి  తనను ఇబ్బంది పెట్టరాదు. తన మనసులోని బాధను తెలుసుకునే ఒక మంచి స్నేహితురాలిగా (Friend) సలహాలు (Ideas) సూచనలు ఇవ్వాలి. తను చేసే పని సరైనదా కాదా అని తనకు అర్థమయ్యేలా తెలియపరచాలి. ఈ విధంగా భర్త మనసును మెప్పించే భార్య ఉంటే భర్త ఖచ్చితంగా తన భార్య మాటవింటారు.

click me!