కోపం మనల్ని కంట్రోల్ చేసే లోపే మనం దానిని కంట్రోల్ చేయాలట. అప్పుడే మన చుట్టూ ఉన్నవారితో మనం ఆనందంగా ఉండగలం. అలా కాకుండా.. ఆ కోపానికి మనం ఒక్కసారి లొంగిపోతే.. అది మనను ఎప్పుడూ డామినేట్ చేస్తూ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోపం ఎంతటివారినైనా నాశనం చేస్తుంది. తన కోపమే తన శత్రువు అంటూ మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. విపరీతమైన కోపం వచ్చినవారు.. ఆ కోపంలో ఏం చేస్తారో కూడా వారికే తెలీదు. అందుకే.. కోపం మనల్ని కంట్రోల్ చేసేలోపే మనం దానిని కంట్రోల్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ కోపం కారణంగా.. చాలా మంది చాలా బంధాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే.. దానిని మొదట్లోనే మొగ్గను తుంచినట్లు తుంచేయాలి. అయితే.. ఇది చెప్పినంత సులభం కాకపోవచ్చు. కానీ బంధాలను నిలపెట్టుకోవాలంటే చేయాల్సిందే. మరి ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
మీరు ఎంత కోపంగా ఉన్నా.. ఆందోళనగా ఉన్నా.. దాని గురించి రియాక్ట్ అవ్వడానికి కనీసం పది సెకన్ల సమయం తీసుకోండి. ఆ పది సెకన్ల సమయం చాలు.. మీలో ఉన్న కోపాన్ని తగ్గించుకోవాడానికి. దాదాపు కోపంలో తీసుకునే నిర్ణయాలు పొరపాట్లు అయ్యే ప్రమాదం ఉంది. ఆ సమయంలో ఏది మంచో.. ఏది చెడో కూడా సరిగా ఆలోచించలేం. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తర్వాత సమస్యలు తీసుకువస్తాయి. అందుకే.. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి.
మీకు కోపం వచ్చిందని అనిపించగానే.. కళ్లు మూసుకొని పది నెంబర్లు లెక్క పెట్టాలి. ఆ సమయంలో కోపం తగ్గే అవకాశం ఉంటుంది.
ఆతర్వాత.. దాని గురించి ఆలోచిస్తే.. మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆలోచించే విధానంలోనూ మార్పు వస్తుంది. దాని వల్ల పెద్దగా సమస్యలు రాకుండా ఉంటాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగినవారు కూడా అవుతారు.
కోపంలో చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడతారు. వ్యంగ్యం అనేది హాస్యం కాదనే విషయం గుర్తించుుకోవాలి. ఆ వ్యంగ్యంగా మాట్లాడే మాటలు ఎదుటివారిని బాగా ఇబ్బందిపెడతాయి. కాబట్టి.. అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలి. దానికి బదులు.. కోపాన్ని తగ్గించుకోవడానికి.. తేలికపాటి జోకులు వేయాలి. అలా వేయడం వల్ల పరిస్థితి సాధారణంగా వచ్చే అవకాశం ఉంటుంది.
కొన్ని విషయాలు వినగానే మనకు వెంటనే కోపంవస్తుంది. అయితే.. ఆ సమయంలో దానిని కనుక నిగ్రహాంచుకోగలిగితే.. మిమ్మల్ని మీరే గెలిచినవారు అవుతారు. అంతేకాదు.. జీవితంలో మనకు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయని. వాటితో పోలిస్తే ఇది ఎంత అనుకోగలిగితే.. ఎంతటి కోపాన్ని అయినా తగ్గించుకోగలగచ్చట. ఎవరైనా తప్పు చేశారు అని నిలదీస్తే.. నిజంగానే చేస్తే.. చేశానని అంగీకరించాలట. అలా చేయడం వల్ల.. సగం పరిస్థితి అదుపులోకి వచ్చేస్తుందట.
ఇక చివరగా.. మెడిటేషన్, వ్యాయామం, యోగా వంటి వాటిపై ఫోకస్ పెట్టాలి. వాటి వల్ల.. మనకు మనశ్శాంతి లభిస్తుంది. కోపం కూడా కంట్రోల్ అవుతుంది. కాబట్టి.. మెడిటేషన్, యోగా వంటి వాటిపై దృష్టి పెట్టాలి.