వీర్య కణాలు తగ్గిపోతున్నాయా.. కారణాలు ఇవే కావచ్చు..!

First Published | Sep 13, 2021, 3:18 PM IST

వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం.. ఒకవేళ ఉన్న వీర్య కణాలు సైతం చలనం లేకుండా ఉండటం.. అనారోగ్య సమస్యలతో బాధపడటం.. ఇలాంటి కారణాలన్నీ.. వంధత్వానికి దారితీస్తాయి.
 

ఈ రోజుల్లో చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.  అయితే.. సంతానం కలగకపోవడానికి చాలమంది అమ్మాయిల్లోనే సమస్య ఉందని అనుకుంటూ ఉంటారు. అయితే.. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోయినా కూడా సంతాన లేమి సమస్య ఏర్పడుతుందనే విషయం తెలసుకోవాలి.

అయితే.. ఈ వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడానికి వారి ఆరోగ్యం కూడా కారణమౌతుందట. ఇదొక్కటే కాదు చాలా కారణాలు ఉంటాయట. అసలు వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడానికి కారణమేంటో ఓసారి చూద్దాం..


వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం.. ఒకవేళ ఉన్న వీర్య కణాలు సైతం చలనం లేకుండా ఉండటం.. అనారోగ్య సమస్యలతో బాధపడటం.. ఇలాంటి కారణాలన్నీ.. వంధత్వానికి దారితీస్తాయి

కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గుతుందట. కాబట్టి.. అలాంటి మందులు వాడకుండా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మందులు డాక్టర్లు సూచించినవి మాత్రమే వాడాలి. వాటివల్ల సంతాన సమస్యలు రాకుండా ఉంటాయో లేదో కనుక్కోవాలి.

మద్యం అధికంగా సేవించడం వల్ల కూడా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుందట. స్మెర్ప్ ఉత్పత్తి తగ్గడానికి మద్యం కారణమౌతుందట. అందుకే మద్యానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


పొగాకు కూడా వీర్య కణాల సంఖ్యను తగ్గిస్తుంది. పొగ తాగే అలవాటు ఉన్నవారిలో.. స్పెర్మ్ కౌంట్ పూర్తిగా పడిపోతుందట. కాబట్టి.. పొగాకు ను పూర్తిగా దూరం చేసుకోవాలి.

stress

మన లైఫ్ స్టైల్ లో మార్పులు.. ఎక్కువ పని గంటల కారణంగా.. ఒత్తిడికి గురౌతుంటారు. అంతేకాకుండా నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి.. వీటి కారణంగా కూడా వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది

ఊబకాయం ...

స్థూలకాయం వంధ్యత్వానికి కారణమవుతుందని అమెరికన్ సొసైటీ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్ (ASRM) చెబుతోంది. బరువు పెరగడం వలన శరీరంలో హార్మోన్ల మార్పులు మరియు పురుషులలో స్పెర్మ్ ఉత్పత్తికి కారణమయ్యే టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి.

టైప్ 2 డయాబెటిస్ ...

ఊబకాయం తరచుగా టైప్ 2 డయాబెటిస్‌తో ముడిపడి ఉంటుంది. దీనివల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. అందువల్ల, మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం మరియు క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చాలా ముఖ్యం.
 


కొన్ని ఇన్ఫెక్షన్లు స్పెర్మ్ ఉత్పత్తికి మరియు దాని ఆరోగ్యానికి ఆటంకం కలిగిస్తాయి మరియు స్పెర్మ్ గుండా వెళ్ళకుండా నిరోధించవచ్చు. ప్రోస్టేట్ గ్రంథి యొక్క అంటువ్యాధులు మరియు ఎడెమా స్పెర్మ్ కౌంట్‌ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.

రేడియేషన్ ...

క్యాన్సర్ లేదా ఇతర రేడియేషన్ కింద చికిత్స పొందిన పురుషులు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే అవకాశం ఉంది.

Latest Videos

click me!