శృంగారం ఎప్పుడూ ఒకేలా ఉండదట. వయసుని బట్టి కూడా మారుతుంది. ముఖ్యంగా యుక్త వయసులో అంటే.. 20ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఉన్న శృంగార భావన.. ఆ తర్వత కూడా అలానే ఉండదట. వయసు పెరిగే కొద్ది.. క్లైమాక్స్ చేరుకునే సమయం దగ్గర నుంచి.. చాలా మార్పులు చోటుచేసుకుంటాయట.
ముఖ్యంగా మీరు కనుక మూడు పదుల వయసు దాటి ఉంటే.. సెక్స్ జీవితంలో మీకు జరిగే మార్పులను కచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి మార్పులు జరుగుతాయో మనం కూడా ఇప్పుడు చూద్దాం..
sex
శృంగార జీవితం మొదలైన తొలి నాళ్లలో దానిపై మోజు ఎక్కువగా ఉంటుందట. కానీ.. మూడు పదుల వయసు చేరుకునే సరికి.. అంత బలమైన కోరిక ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఈ సమయంలో ఎక్కువ ఎంజాయ్ చేయవచ్చని అనుకుంటారు. కానీ.. ఆ సమయానికి పిల్లలు వచ్చేస్తారు.. ఉద్యోగాల్లో టెన్షన్ పెరిగిపోతుంది.. కాబట్టి.. అంత ఆసక్తి ఉండకపోవచ్చని చెబుతున్నారు.
sex
ఇక కొందరు.. పిల్లలు కలగకుండా ఉండేందుకు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. అయితే.. ఆ ట్యాబ్లెట్స్ కారణంగా కూడా.. సెక్స్ చేయాలనే కోరిక తగ్గిపోతుందట. ఈ ట్యాబ్లెట్స్.. అండోత్సర్గమును నిరోధిస్తాయి. దీని వల్ల వారిలో టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. దాని వల్ల జననాంగాలు పొడిగా మారిపోతాయి.
ఈ క్రమంలో... సెక్స్ చేస్తున్న సమయంలో.. ఇబ్బందిగా ఉండి.. కలయికను పూర్తిగా ఆస్వాదించలేరట. ఈ సమస్య ఎదురైతే... వారు కచ్చితంగా గైనకాలజిస్ట్ ని సంప్రదించాలయని నిపుణులు చెబుతున్నారు.
లైంగిక పరమైన కోరికలు కలగకపోతే.. సెక్స్ విషయంలో ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది. కాబట్టి.. ఆ సమస్య నుంచి బయటపడటం కోసం పార్ట్ నర్ తో ప్రేమగా ఉండాలి. కోరిక కలిగేందుకు ఇద్దరూ కలిసి ప్రయత్నించాలి. రొమాన్స్ కి ఎక్కువ సమయం కేటాయించాలి.
అయితే.. వయసు పెరిగే కొద్ది.. మహిళలకు సెక్స్ విషయంలో ఏమి కావాలి అనే విషయం అర్థమౌతుందట. కాబట్టి.. ఎలా చేస్తే.. సెక్స్ ని పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతారో అలా చేయడానికి ఆసక్తిచూపించాలట.
sex
అలా కాదు అంటే.. ఎప్పుడూ ఒకేలా కాకుండా.. కొన్ని ప్రయోగాలు చేయాలట. అలా ప్రయోగాలు చేయడం వల్ల కలయికను ఆస్వాదించగలుగుతారట. లేదంటే.. కలయిక వారికి ఇబ్బందిగా అనిపించే ప్రమాదం ఉందట. లేదంటే.. పార్ట్ నర్ బలవంతం మీద మొండిగా చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.