ప్రతి రోజూ శృంగారంలో పాల్గొంటే..!

First Published | Sep 19, 2023, 10:31 AM IST

శృంగారంతో ఒకటి కాదు రెండు  కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. సెక్స్ తో గుండె ఫిట్ గా ఉంటుంది. కేలరీలు బర్న్ అవుతాయి. అలాగే.. 
 

Sleeping after having sex

భార్యాభర్తల మధ్య సెక్స్ ఖచ్చితంగా ఉండాలంటరు నిపుణులు. ఎందుకంటే ఇది వారిద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. అలాగే వారి బంధాన్ని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా ఇది ఇద్దరినీ ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంటుంది. ప్రతిరోజూ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మీరు మానసికంగా, భావోద్వేగంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. సెక్స్ మీ  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఎన్నో వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. దీంతోపాటుగా రిలేషన్ షిప్ లో మీకు అవగాహన పెరుగుతుంది. అలాగే రిలేషన్ షిప్ గ్యాప్ కూడా దూరం అవుతుంది. చాలా మంది జంటలు మధ్య వయస్సు నుంచే సెక్స్ కు దూరంగా ఉంటారు. కానీ ఇది మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది. 
 

నిపుణుల ప్రకారం..  క్రమం తప్పకుండా సెక్స్ లో పాల్గొనడం వల్ల మీ మనస్సు చురుగ్గా ఉంటుంది. మీ శరీరం శక్తివంతంగా ఉంటుంది. అలాగే ఇది మీ కటి కండరాలను బలోపేతం చేస్తుంది. ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొనడం వల్ల దంపతుల మధ్య బంధం పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరిగి అదనపు కేలరీలు బర్న్ అవుతాయి. ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


రోగనిరోధక శక్తి బలోపేతం 

క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొంటే రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుందని ఎన్సీబీఐ తెలిపింది. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మీ శరీరంలో ఇమ్యునోగ్లోబులిన్ ఎ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఒక రకమైన యాంటీబాడీ. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే మీరు రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనడం వల్ల యాంగ్జైటీ, స్ట్రెస్ వంటి సమస్యలు రావు. 
 

మంచి నిద్ర 

సెక్స్ సమయంలో మీ శరీరం నుంచి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది లవ్, సాన్నిహిత్య హార్మోన్ గా పరిగణించబడుతుంది. అలాగే భావప్రాప్తి సమయంలో శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ కూడా పెరుగుతుంది. ఈ రెండు హార్మోన్లు కలపడం వల్ల మీకు బాగా నిద్ర పడుతుంది. ఇది మీ అలసటను తగ్గిస్తుంది. దీంతో మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. 
 

గుండె ఆరోగ్యం

రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనే జంటలు గుండె సంబంధిత జబ్బులకు దూరంగా ఉంటారు. నిజానికి  సెక్స్ సమయంలో హృదయ స్పందన రేటు, రక్త ప్రవాహం, ఆక్సిజన్ వినియోగం బాగా పెరుగుతాయి. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొనడం వల్ల ఆడవారిలో గుండె సంబంధ వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 
 

కటి ఫ్లోర్ కండరాలకు ప్రయోజనం

శృంగారం మన శరీరాన్ని చురుగ్గా ఉంచడంతో పాటుగా ఎన్నో సమస్యలకు కూడా దూరంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా సెక్స్ లో పాల్గొనడం వల్ల కటి ఫ్లోర్ కండరాలు బలంగా మారుతాయి. అంతేకాకుండా ఇది గర్భాశయాన్ని, బ్లెండర్ ను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. నిజానికి సెక్స్ లో పాల్గొనడం వల్ల మీ దిగువ శరీరం ఆరోగ్యంగా మారుతుంది. అలాగే యోని సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. 
 

కేలరీలు బర్న్ 

జర్నల్ పిఎల్ఓఎస్ వన్ ప్రకారం.. రోజూ సెక్స్ లో పాల్గొనడం వల్ల 1 గంటలో 150 కేలరీలు ఖర్చవుతాయి. దీంతో మీరు బరువు పెరిగే అవకాశం ఉండదు.  సెక్స్ తో శరీరం ఫిట్ గా ఉండి కండరాలకు బలం అందుతుంది. రెగ్యులర్ సెక్స్ మిమ్మల్ని మీ భాగస్వామికి మరింత దగ్గర చేస్తుంది.
 

Latest Videos

click me!