చాలా మంది దాంపత్య జీవితంలో వారికి వారే సమస్యలు కొని తెచ్చుకుంటారు. సజావుగా సాగుతున్న దాంపత్య జీవితంలోకి మరొకరికి చోటు కల్పించి... వారి బంధానికి బీటలు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ కింది వాటిలో మీరు ఏది చేసినా... మీ భాగస్వామిని మోసం చేసినట్లే అవుతుందట. మరి అవేంటో ఓసారి చూద్దాం...
1. మీరు ఒక రిలేషన్ లో ఉండి కూడా.... మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం మోసం కిందకు వస్తుంది. కేవలం శారీరక సంబంధం పెట్టుకోవడం మాత్రమే కాదు... ముద్దు పెట్టుకోవడం కూడా మోసమే అవుతుంది.
2.కేవలం ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే మాత్రమే కాదు... మానసికంగా కనెక్షన్ పెట్టుకున్న కూడా... అది మోసం కిందకే వస్తుంది. మీరు మీ భాగస్వామితో కాకుండా.. మరెవరితో అయినా.. మానసికంగా కనెక్ట్ అయితే... మీరు మీ పార్ట్ నర్ ని మోసం చేసినట్లే.
3.ఇది మూడో రకం మోసం. ఫిజికల్ రిలేషన్ పెట్టుకోలేదు, మానసికంగానూ కనెక్ట్ అవ్వలేదు. కేవలం ఆన్ లైన్ లో రొమాంటిక్ గా చాట్ చేశాం. అది తప్పు ఎలా అవుతుందని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ... మీరు మీ భాగస్వామికి తెలియకుండా...మరొకరికి రొమాంటిక్ మెసేజ్ లు చేయడం, చాటింగ్ చేయడం లాంటివి చేసినా అది మోసం కిందకే వస్తుంది.
4.ఇక ఇది మరో రకం మోసం. మీరు మీ భాగస్వామి కి తెలియకుండా.. మరొకరిని రహస్యంగా కలవడం, వారితో మాట్లాడటం లాంటివి చేసినా అది కూడా మోసం చేయడం కిందకే వస్తోంది.
5.ఇక మీరు మీ భాగస్వామితో కాకుండా మరొకరితో ఎప్పుడో ఒకసారైనా వెకేషన్ కి వెళ్లడం, డేట్ కి వెళ్లడం లాంటివి చేసినా మీరు మీ భాగస్వామిని మోసం చేసినట్లే. కేవలం ఒక్కాసారి వెళ్లినా అది మోసమే.
6.మీరు భాగస్వామి దగ్గర ఆర్థిక విషయాలు, లావాదేవీల గురించి దాచి పెడుతున్నా, వారికి తెలీకుండా అప్పులు చేయడం లాంటివి చేస్తున్నా.... అది కూడా మోసం కిందకే వస్తుంది. అంతేకాదు.. వారికి తెలీకుండా అధికంగా ఖర్చు చేస్తున్నా అది కూడా మోసం కిందకే వస్తుంది.
7.శారీరకంగా , మానసికంగా మీ భాగస్వామిని నెగ్లెక్ట్ చేయడం, వారిని అన్ని విషయాల్లో ఎవాయిడ్ చేయడం లాంటివి కూడా మోసం కిందకే వస్తాయి.