భార్య భర్తల మధ్య బంధం సరిగా ఉండాలంటే వారి మధ్య సఖ్యత ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇలా ఎన్ని చేసినా కూడా... దంపతుల మధ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే.. ఇద్దరిలో ఎవరికో ఒకరిని ఓపిక ఉండాలి. ఎందుకంటే.... ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు.
ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో పొరపాట్లు చేస్తూనే ఉంటారు. ఆ పొరపాట్లను అర్థం చేసుకోవాలి అంటే... కాస్త అయినా ఓపిక ఉండాలి. నిజంగా మీ భర్తకు ఓపిక ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
couple fight
1.మీరు ఎన్ని తప్పులు చేసినా.. మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ.. ఉన్నా, మీరు ఎంత ఇమెచ్యూర్ గా ప్రవర్తించినా కూడా.. అర్థం చేసుకుంటున్నారంటే... వారు చాలా ఓపికగా ఉంటున్నారనే అర్థం.
2.మీరు పడే కష్టాలు, మీరు పడుతున్న శ్రమను చూసి మీ భర్త మీద దయచూపిస్తున్నాడు అంటే వారు చాలా మంచి వారనే అర్థం. అంతేకాకుండా... ప్రతి విషయాన్ని మీ వైపు నుంచి ఆలోచించి.. మీకు అండగా ఉంటున్నాడంటే వారికి ఎంతో ఓపిక, అర్థం చేసుకునే మనసు ఉందని అర్థం.
3.మీరు ఇమ్మెచ్చూరిటీతో ఉన్నా కూడా.. వారు ఎలాంటి విసుగు, కోపం ప్రదర్శించకుండా.. అర్థం చేసుకుంటూ, మీతో ఎలాంటి గొడవలు పెట్టుకోవడం లేదు అంటే వారికి ఓపిక చాలా ఎక్కువ అనే చెప్పాలి.
4.మీకు ప్రతి నిమిషం అన్ని విషయాల్లోనూ గైడెన్స్ ఇస్తూ, మీకు ఎలాంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తపడుతున్నారంటే కూడా వారికి ఓపిక ఉందనే అర్థం.
5.మీరు వ్యక్తితంగా, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు ప్రోత్సాహం ఇస్తూ.. మీకేమీ తెలియకపోయినా వారు విసుక్కోకుండా మీకు సహాయం చేస్తున్నారంటే వారికి చాలా ఓపిక ఉందనే అర్థం.