పవిత్రమైన వివాహబంధంతో (Marriage bond) ఒక్కటైన భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా, నిండు నూరేళ్ల జీవితాన్ని ప్రారంభించాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తమ జీవన ప్రయాణాన్ని (Life journey) సుఖమయంగా ఉంచుకోవాలి. భార్యాభర్తలు ఇరువురూ తనువులు వేరైనా మనసులు ఒకటిగా నిలుపుకోవాలి.
భార్యాభర్తలిద్దరూ వారి జీవన ప్రయాణం (Life journey) ఎలా ఉంటే వారు సుఖంగా ఉంటారో ఒక ప్రణాళికను పాటించాలి. జీవన ప్రయాణంలో ఎలాంటి దాపరికాలు (Hides) ఉండరాదు. శివపార్వతులగా ఎప్పుడూ కలిసి మెలిసి ఉండాలి. వారి మనసులోని అభిప్రాయాలను ఒకరికొకరు తెలియచేసుకోవాలి.
కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవాలి. భార్యకు అనారోగ్యంగా ఉంటే భర్త తోడుగా, భర్తకు అనారోగ్యంగా (Illness) భార్య తోడుగా ఉండాలి. ఒకరిపై మరొకరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. సమయం దొరికినప్పుడు భార్యకు ఇంటి పనుల్లో సహాయం (Help) చేయాలి.
భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు తక్కువగా చూసుకోరాదు. ఇద్దరూ సమానం (Equally) అనే భావన కలిగి ఉండాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ (Love), గౌరవం ఏర్పడాలి. వారి అభిప్రాయాలను గౌరవించుకోవాలి. ఏ విషయంలోనైనా గొడవ జరిగితే ఆ గొడవకు గల కారణాన్ని తక్షణమే పరిష్కరించుకోవాలి.
సుఖదుఃఖాలలో (Pleasures) కష్టాలను పంచుకోవడానికి ఒకరికొకరు ఒక మంచి స్నేహితులుగా (Friend) నేనున్నానని భావన కల్పించుకోవాలి. భర్త చేసే పని (Work) చిన్నదయినా వారికి తోడునీడగా ఉండాలి. భర్త వేసే ప్రతి అడుగులో నేను మీకు తోడుగా ఉన్నానంటూ ప్రోత్సహించాలి.
భార్య ఇచ్చే ఈ ప్రోత్సాహమే భర్త మరిన్ని విజయాలకు దారి తీస్తుంది. మంచి అలవాట్లు (Good habits), జీవన విధానం (Life style) పాటించాలి. మంచి జీవన విధానమే మంచి ఆరోగ్యానికి (Good health) దారితీస్తుంది. మంచి ఆరోగ్యమే దాంపత్య జీవితాన్ని బాగుచేస్తుంది.
మంచి దాంపత్య జీవితమే ఆరోగ్యమయిన సంతానాన్ని (Happiness) కలుగజేస్తుంది. ఇరువురి కుటుంబ (Family) సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలి. భర్త తన పని ఒత్తిడిని (Pressure) భార్యపై చూపించరాదు. ఇద్దరూ ఏకాంతంగా ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి.
ఇరువురు ధర్మ మార్గంలో నిజాయితీగా (Honestly) జీవితాన్ని కొనసాగించాలి. భర్త తప్పుదారిలో నడుస్తుంటే ఇది తప్పని వారికి అర్థమయ్యేలా తెలియజేయాలి. ఈ నియమాలను పాటిస్తే మీ జీవితం (Life) నిండు నూరేళ్లు సంతోషంగా (Happy), అన్యోన్యంగా ఉంటుంది.