మొదటిరాత్రి రోజు ఈ సమస్య రావొచ్చు.. దీన్ని ఎలా తగ్గించుకోవాలంటే?

First Published | Nov 26, 2023, 2:47 PM IST

మీ వయస్సు, అనుభవంతో సంబంధం లేకుండా.. కొత్త ప్రారంభం ఎప్పుడూ కూడా మిమ్మల్ని భయాందోళలనకు గురిచేస్తుంది. మీకు కొత్తగా పెళ్లైతే మొదటి రాత్రి మీకు ఆ లైంగిక సమస్య ఎదురుకావొచ్చు. దీన్నిఎలా తగ్గించుకోవాలంటే?
 

కొత్తగా పెళ్లైన జంటలు ఎదుర్కొనే సర్వ సాధారణ సమస్య ఇది. ఫస్ట్ నైట్ రోజు చాలా జంటలు భయాందోళనకు గురువుతాయి. అంచనాలకు అనుగుణంగా ఉండలేమోననే భయం ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. ఇది సంబంధంలో ఒత్తిడిని కలిగిస్తుంది. కొత్త జంటలు ఎదుర్కొనే కామన్ సమస్య  లైంగిక పనితీరు ఎలా ఉంటుందోనన్న భయం. ఇది మొదటిరాత్రిని భయంకరంగా మారుస్తుంది. అసలు ఇలా ఎందుకు అవుతుంతో తెలుసా? 


పనితీరు ఆందోళన లక్షణాలు ఏమిటి?

లైంగిక పనితీరు ఆందోళన లక్షణాలు మనిషిలో ఎన్నో విధాలుగా కనిపిస్తుంది. అంటే అరచేతుల్లో చెమటలు పట్టడం, చేతులను నలిపేయడం వంటివి కనిపిస్తాయి. కొన్ని కొన్నిసార్లై ఈ లక్షణాలు చాలా తీవ్రమైన పానిక్ అటాక్ రూపంలో కూడా కనిపిస్తాయి.ఇది అసంతృప్తి, ఒత్తిడికి దారితీస్తుంది. దీన్నే ఓవర్ కం పర్ఫామెన్స్ యాంగ్జైటీ అంటారు. మరి దీన్ని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 


Boring Sex Life

మాటలతో ప్రారంభించండి 

ఏ రిలేషన్ షిప్ లోనైనా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, మాట్లాడుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. కానీ లైంగిక సంబంధంలోని వారి మనసులోని భావాలు, ఆందోళనల గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. కాని అన్ని విషయాలను షేర్ చేసుకోవడం, ఒకరినొకరు ఓదార్చుకోవడం చాలా ముఖ్యం. అవగాహన, ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల మీరు ఈ సమస్య నుంచి గట్టెకొచ్చు. మీ భయాందోళనల గురించి బహిరంగంగా మాట్లాడుకోండి. ఇది మీ ఇద్దరి ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మొదటి రాత్రిని బాగా ఎంజాయ్ చేస్తారు. 

Sex Life

ఆనందం

లైంగిక పనితీరు ఆలోచన గురించి కాసేపు మర్చిపోండి. కేవలం శారీరక అంశాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా భావోద్వేగ సాన్నిహిత్యం, కనెక్షన్, ఆనందంపై దృష్టి పెట్టండి,  సాన్నిహిత్యం మీ లైంగిక పనితీరును మెరుగ్గా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే ఇది మీ యాంగ్జైటీని తగ్గిస్తుంది. 

ఒకే సమయంలో వేర్వేరు వస్తువులను ఉపయోగించండి

ప్రతి రిలేషన్ షిప్ లో థ్రిల్ మెయింటైన్ చేయడానికి ఏదైనా కొత్తగా చేయడం  చేయడం చాలా ముఖ్యమంటారు నిపుణులు. మీరు ఒకే పని చేస్తే అది కాసేపటి విసుగ్గా మారుతుంది. కొత్తగా చేయడం వల్ల మీరు లైంగికంగా ఎలాంటి యాంగ్జైటీకి గురికారు. అలాగే మీ పనితీరు గురించి ఆందోళన కూడా ఉండదు. మీరిద్దరూ ఒకరితో ఒకరు బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు.
 

Image: Getty

మీరు రిలాక్స్ కావడానికి టెక్నిక్స్

మీ దినచర్యలో స్వీయ-విశ్రాంతి పద్ధతులను చేర్చండి. లోతైన శ్వాస, ధ్యానం మీరు లైంగిక కార్యకాలాపాల్లో పాల్గొనడానికి ముందు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడతాయి. మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోవడం వల్ల లైంగికంగా మీరు ఎలాంటి ఒత్తిడికి లోనుకారు. 
 

Latest Videos

click me!