Relationship: ఫ‌స్ట్ నైట్ ఈ త‌ప్పులు చేస్తే.. జీవితాంతం బాధ‌ప‌డాల్సిందే

Published : Jul 02, 2025, 01:01 PM ISTUpdated : Jul 02, 2025, 01:02 PM IST

వివాహం కేవ‌లం రెండు వ్య‌క్తుల మ‌ధ్య శారీర‌క బంధ‌మే కాదు ఇద్ద‌రు మ‌నుషుల మధ్య ప్రేమ‌, విశ్వాసం, స‌మ‌న్వ‌యాన్నికలిపే గొప్ప బంధం. ఇలాంటి అనుబంధంలో తొలి రాత్రి ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. ఇది మధురస్మృతి కావాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. 

PREV
15
మాట్లాడకపోవడం

తొలి రాత్రి అంటే కేవ‌లం శారీరకంగా ద‌గ్గ‌ర‌వ్వ‌డం మాత్ర‌మే కాదు. భావోద్వేగంగా ద‌గ్గ‌ర‌వ్వ‌డం కూడా. కొంతమంది సిగ్గు, భ‌యంతో మాట్లాడటంలో వెనకడుగు వేస్తారు. కానీ పరస్పర భావాలను పంచుకోవడం ద్వారా విశ్వాసం పెరుగుతుంది. సరళంగా మాట్లాడటం, పరస్పర కోరికలు అర్థం చేసుకోవడం ముఖ్యమైన విషయం.

25
ఆశ‌లు వ‌ద్దు

చాలామంది సినిమాలు, కథల ప్రభావంతో మొదటి రాత్రిపై అధికంగా ఊహలు పెంచుకుంటారు. వాస్తవ జీవితంలో కూడా అలాగే ఉంటుంద‌న్న భావ‌న నిరాశ క‌లిగించే అవ‌కాశం ఉంటుంది. భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య బంధం కేవ‌లం ఒక రాత్రికి ప‌రిమితం కాద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. రియాలిటీలో జీవించ‌డం అర్థం చేసుకోవాలి.

35
మ‌త్తు ప‌దార్థాల‌కు దూరంగా

కొంత‌మంది ఆ స‌మ‌యంలో ఆల్క‌హాల్ వంటి మ‌త్తు ప‌దార్థాలు తీసుకుంటారు. మత్తులో మీరు మీ భాగస్వామి భావోద్వేగాలను అర్థం చేసుకోలేరు, తార్కికంగా స్పందించలేరు. అది ఈ మధురమైన రాత్రిని చెడగొట్టే ప్రమాదం ఉంది.

45
శారీరక సంబంధంపై ఒత్తిడి పెట్టడం

తొలిరాత్రి క‌చ్చితంగా శారీర‌కంగా ఏకం కావాల‌నే భావ‌న‌లో ఉండ‌కండి. ఇద్ద‌రికీ న‌చ్చిన‌ప్పుడు జ‌రిగితేనే బాగుంటుంది. భాగస్వామికి అసౌకర్యంగా ఉన్నా, మీరు ఒత్తిడి తెస్తే అది వారిలో మీపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి, పరస్పర గౌరవం, ఓర్పుతో ముందుకెళ్లడం ముఖ్యం.

55
అలసట, ఒత్తిడిని తగ్గించుకోకపోవడం

పెళ్లి వేడుక‌ల కార‌ణంగా చాలా మంది అలసటతో ఉంటారు. అలాంటి సమయంలో ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మాట్లాడుకుంటూ రిలాక్స్ అవడం, వీలైనంత వ‌ర‌కు విశ్రాంతి తీసుకోవ‌డం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories