భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా నమ్మకం ఉంది తీరాలి అయితే మీ భాగస్వామికి నమ్మకం ఉన్నదా.. వాళ్లు నిజంగానే మిమ్మల్ని నమ్ముతున్నారా అని మీ కనిపించినప్పుడు ఈ చిట్కాలతో ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోండి. సమస్యని సులువుగా పరిష్కరించుకోండి. మీ భాగస్వామి మీ పరిచయస్తుల గురించి మీ భవిష్యత్ ప్రణాళికల గురించి తరచూ అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా..
మీ గురించి ఓవర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అయితే కచ్చితంగా ఆ వ్యక్తి మిమ్మల్ని అనుమానిస్తున్నారని నిర్ధారించుకోవచ్చు ఎందుకంటే అవతలి వ్యక్తికి మీ మీద నమ్మకం లేకపోవడం వలన పదేపదే..
మీ ప్రణాళికల గురించి అడుగుతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే మీ ఫ్రెండ్స్ తో గాని పనిచేస్తులతో గానీ గడపటానికి మీకు పర్మిషన్ ఇవ్వడం లేదంటే అనుమానిస్తున్నట్లే.
ఎందుకంటే వారు లేనప్పుడు మీరు ఏం మాట్లాడుకుంటారో ఎలా ప్రవర్తిస్తారో అనే ఆలోచన అతనిని కుదురుగా ఉండనివ్వదు. అందుకే మీరు మీ ఫ్రెండ్స్ తో ఉంటాను అంటే పర్మిషన్ ఇవ్వరు. అంటే కచ్చితంగా మీ ప్రవర్తన మీద నమ్మకం లేనట్టే లెక్క.
అలాగే అవతలి వ్యక్తి ఫోన్ చేసిన వెంటనే మీరు కాల్ లిఫ్ట్ చేయకపోయినా టెక్స్ట్ మెసేజ్ చేయకపోయినా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అంటే కచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని అనుమానిస్తున్నారు అర్థం. మీరు బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఆలోచన వాళ్ళకి రాదు.
వాళ్ళని నెగ్లెట్ చేయడం వలన మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని భావిస్తారు. అలాగే తన లేనప్పుడు ఏం జరిగిందో కూడా తెలుసుకోవటం కోసం మనల్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తారు. అది కూడా మిమ్మల్ని అనుమానిస్తున్నారు అనటానికి ఒక ఉదాహరణ. ఇలాంటి పరిణామాలు మీకు ఎదురైతే మాత్రం అవతలి వ్యక్తి అనుమానాన్ని తీర్చే ప్రయత్నం చేయండి.