కానీ పగలు, ప్రతీకారాలు మాత్రం మానిపోయిన గాయాలని మళ్ళీ రేపుతూ ఉంటాయి జరిగిపోయిన గొడవలని తవ్వి తీస్తాయి. కాబట్టి తప్పకుండా ప్రస్తుత సమస్యని పరిష్కరించుకోండి. అలాగే మీ గిల్లికజ్జాలలోకి కుటుంబ సభ్యులని లాగకండి. ఎందుకంటే ఎవరి కుటుంబ సభ్యులు అని వివరించిన ఎవరూ ఊరుకోరు. ఆ కోపంలో మీ కుటుంబ సభ్యులను కూడా విమర్శిస్తే మీరు భరించలేరు.