Relationship Psychology: ఓవర్ థింకింగ్ రిలేషన్ షిప్‍ని దెబ్బతీస్తుందా? సైకాలజీ ఏం చెబుతోంది?

Published : Apr 07, 2026, 04:16 PM IST

ప్రస్తుత కాలంలో రిలేషన్‌షిప్‌లు బాగుండాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు. మన ఆలోచనా విధానం కూడా బంధం నిలబడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొందరు చిన్న విషయం గురించి కూడా ఓవర్ గా ఆలోచిస్తుంటారు. ఇది ప్రేమను కాపాడుతుందా లేక దెబ్బతీస్తుందా? సైకాలజీ ఏం చెబుతోంది? 

PREV
15
Relationship Psychology

ఓవర్ థింకింగ్ అనేది మనిషి సహజమైన ఆలోచనా ప్రక్రియలో భాగమే అయినప్పటికీ, అది నియంత్రణలో లేకపోతే వ్యక్తిగత జీవితాన్ని, ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంటుంది. సైకాలజీ ప్రకారం, ఓవర్ థింకింగ్ అంటే ఒక సంఘటన, మాట, లేదా ప్రవర్తన గురించి మళ్లీ మళ్లీ ఆలోచించడం, దానిలో అర్థాలు వెతకడం, అసలు లేని సందేహాలను సృష్టించడం.

ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఒక భాగస్వామి చెప్పిన చిన్న మాటను పెద్దగా భావించడం, రిప్లై ఆలస్యమైతే దాన్ని నిర్లక్ష్యంగా భావించడం, గతంలో జరిగిన విషయాలను వర్తమానానికి లింక్ చేయడం వంటి అలవాట్లు సంబంధంలో అనవసరమైన ఉద్రిక్తతను పెంచుతాయి.

25
చిన్న విషయాలే పెద్ద గొడవలకు..

సైకాలజీ ప్రకారం ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఆందోళన, తక్కువ ఆత్మవిశ్వాసం, అభద్రతా భావం వల్ల వస్తుంది. ఈ భావాలు మనలో ఉండటం వల్ల మనం నిజమైన పరిస్థితిని అర్థం చేసుకోకుండా, మన ఊహలను నిజమని నమ్మడం ప్రారంభిస్తాం. ఫలితంగా, భాగస్వామిపై అనుమానం పెరుగుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. చిన్న విషయాలే పెద్ద గొడవలకు దారితీస్తాయి.

35
రిలేషన్ షిప్ లో ఈ 2 ముఖ్యం..

రిలేషన్‌షిప్‌లో నమ్మకం, స్పష్టమైన సంభాషణ చాలా ముఖ్యమైనవి. అయితే ఓవర్ థింకింగ్ ఈ రెండింటినీ దెబ్బతీస్తుంది. ఒక వ్యక్తికి తమ భాగస్వామికి తనపై ప్రేమ తగ్గిందేమో అని అనుమానం పెంచుకుంటే, తన ప్రవర్తనలో మార్పు వస్తుంది. అతిగా ప్రశ్నించడం, కంట్రోల్ చేయాలని ప్రయత్నించడం లేదా ఎమోషనల్ గా దూరమవ్వడం వంటివి చేస్తుంటారు. 

ఈ మార్పులు మరో భాగస్వామికి ఒత్తిడిగా మారి, సంబంధం బలహీనపడే అవకాశాలు పెరుగుతాయి. సైకాలజీ ప్రకారం, ఓవర్ థింకింగ్ చేసే వ్యక్తులు సాధారణంగా మంచి జరుగుతుందనే కంటే చెడు జరుగుతుందనే ఊహలను ఎక్కువగా నిర్మించుకుంటారు. ఈ నెగిటివ్ ఆలోచనలు సంబంధంలో ఆనందాన్ని తగ్గించి, భయాన్ని పెంచుతాయి.

45
అపార్థాలు పెరిగే అవకాశం

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఓవర్ థింకింగ్ వల్ల వ్యక్తి తన భావాలను సరైన విధంగా వ్యక్తపరచలేరు. మనసులో అనేక అనుమానాలు, ప్రశ్నలు తిరుగుతుండటంతో, చెప్పాల్సిన విషయాన్ని క్లియర్‌గా చెప్పలేరు. ఫలితంగా, అపార్థాలు పెరుగుతాయి. సైకాలజీ ప్రకారం మనం ఆలోచనలపై ఎంత ఎక్కువగా ఫోకస్ చేస్తే, అవి అంత ఎక్కువగా మనపై ప్రభావం చూపిస్తాయి.

55
ఇలా చేస్తే హెల్తీ రిలేషన్ షిప్

నిపుణుల ప్రకారం ఓవర్ థింకింగ్ పూర్తిగా చెడు కాదు. నిజానికి కొంతవరకు ఆలోచించడం వల్ల మనం జాగ్రత్తగా ఉంటాం, నిర్ణయాలు మెరుగ్గా తీసుకుంటాం. కానీ అది హద్దులు దాటితేనే సమస్య. నేను ఇప్పుడు అవసరానికి మించి ఆలోచిస్తున్నానా? అనే ప్రశ్న ఎవరికి వారు వేసుకోవడం చాలా ముఖ్యం. భాగస్వామితో మన భావాలను నేరుగా, నెమ్మదిగా పంచుకుంటున్నామా అనే దానిపై కూడా దృష్టి పెట్టాలి. గతం లేదా భవిష్యత్తు గురించి కాకుండా, ప్రస్తుత పరిస్థితిపై దృష్టి పెట్టడం వల్ల ఓవర్ థింకింగ్ తగ్గుతుంది. రిలేషన్ షిప్ హెల్తీగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories