మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీ పేరెంట్స్ తో ఇలా మాట్లాడండి!

First Published | Nov 28, 2021, 12:03 PM IST

ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకు తెలియకుండానే ప్రేమలో (Love) పడుతాం. మన జీవితంలో ఎంత మంది ఉన్నా ఆ వ్యక్తిని మాత్రమే ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడతాము. ఊపిరి ఉన్నంతవరకు తనతోనే జీవించడానికి ఇష్టపడతారు. ప్రేమించిన వ్యక్తికి గుండెల్లో స్థానం ఇస్తారు. ప్రేమించిన వ్యక్తి లేకపోతే వారు బ్రతకడం వృధా అనిపిస్తుంది. ఇలా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు వారి ప్రేమను పెద్దలకు తెలపడానికి సంకోచిస్తారు. ప్రేమించిన వ్యక్తి గురించి ఇంట్లో వాళ్లకు ఎలా చెప్పాలని వారి మనసు పలు విధాలుగా గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా ప్రేమించిన వ్యక్తి గురించి ఇంట్లో వాళ్లకు ఏ విధంగా తెలియపరచాలో తెలుసుకుందాం..
 

ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకునే సమయంలో మొదట వారి ప్రేమను ఇంట్లో వారికి తెలియపరచరు. వారి లోకంలో వారు హాయిగా విహరిస్తుంటారు. తమ ప్రేమ గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు. ఎవ్వరికి వారి ప్రేమ తెలియనంత వరకు వారి ప్రేమకు ఎటువంటి ఇబ్బందులు (Difficulties) ఉండవు. హాయిగా సాగిపోతున్న వారి ప్రేమలో అనుకోకుండా కుటుంబ సభ్యుల రూపంలో అలజడి (Twitter) ఏర్పడుతుంది. ఎలా అంటే కుటుంబ సభ్యులు వారి వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు వారి ప్రేమను ఎలా తెలియపరచాలో తెలియక వారిలో వారే సతమతమవుతుంటారు.
 

వారి ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెబితే వారు అంగీకరిస్తారో లేదో అనే భయం వారిలో ఏర్పడుతుంది. తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాక ప్రేమించిన వ్యక్తి దూరం అవుతాడు అనే భయంతో తప్పని పరిస్థితులలో తన ప్రేమను వ్యక్తపరుస్తారు. కొందరు తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరిస్తారు (Agree). వారి పిల్లల భవిష్యత్తు (Future) బాగుండాలని తమ వంతు ప్రయత్నం చేసి వారి ప్రేమను గెలిపించడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి తల్లిదండ్రులు దొరికినప్పుడు వారి ప్రేమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
 


అదే విధంగా కొంతమంది తల్లిదండ్రులు కూడా ప్రేమించుకొని పెళ్లి (Love marriage) చేసుకున్నప్పుడు పిల్లల ప్రేమను కూడా అర్థం చేసుకుని (Understand) పిల్లల ప్రేమను కూడా అంగీకరిస్తారు. అదే ప్రేమ అంటే ఇష్టం లేని తల్లిదండ్రులకు పిల్లల ప్రేమ విషయం తెలిసిన వెంటనే వారు కోప్పడతారు. వారి పెళ్లికి ఒప్పుకోరు. వారు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని పిల్లలపై ఒత్తిడి చేస్తారు. ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకోలేక పెద్దల మాటకు ఎదురు తిరగలేక ప్రేమించిన వ్యక్తుల మనసు నరకయాతనకు గురవుతుంది. ఇలాంటప్పుడు మీరు మీ తల్లిదండ్రులకు మీ ప్రేమ గురించి సరైన అవగాహన కల్పించాలి.
 

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మీ భవిష్యత్తు ఎలా అందంగా ఉంటుందో వారికి అర్థమయ్యేలా వివరించాలి. ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుని వారితో సంతోషంగా జీవించలేమని దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయని వారికి తెలియపరచాలి. మీ ప్రేమ పట్ల వారికున్న అపోహలను తొలగించి పూర్తి నమ్మకాన్ని (Confidence) వారికి ఏర్పరచాలి. అప్పుడే వారు మనస్ఫూర్తిగా మీ ప్రేమను అర్థం చేసుకుంటారు. ఇలా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నప్పుడు వారి జీవన ప్రయాణంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు (Problems) ఏర్పడవు. ప్రేమికులకు ప్రపంచాన్నే జయించినంత సంతోషం కలుగుతుంది.

Latest Videos

click me!