భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే ముఖ్యంగా భార్యాభర్తల ఇద్దరి మధ్యలో క్షమాగుణం కచ్చితంగా ఉండి తీరాలి అంటున్నాడు చాణిక్యుడు ఏ తప్పు జరిగిన క్షమాపణ చెప్పితే సర్దుకోవచ్చు జీవిత భాగస్వామి లోని లోపాలను ఎత్తి చూపించకుండా ఉంటే మంచిది.
మీకు వీలైతే ఆ లోపాలను సరిదిద్దితే మరీ మంచిది. అలాగే మన వల్ల తప్పు జరిగినప్పుడు ఇగోలకి పోకుండా క్షమించమని అడగడం ద్వారా బంధాన్ని మరింత బలపరుచుకోవచ్చట. అలాగే భార్యాభర్తల ఇద్దరి మధ్యన విశ్వాసం కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి.
ప్రేమకి పునాది వంటిది విశ్వాసం అయితే అనుమానం సమాధి వంటిది. కాబట్టి మీ బంధానికి సమాధి కట్టకుండా విశ్వాసంతో బంధాన్ని బలపరుచుకోండి నమ్మకం లేని సంబంధం బలహీనంగా మారుతుంది.
అలాగే ఇద్దరి మధ్యలో గౌరవించుకోవటం అనే లక్షణం కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకుంటూ ఉంటే ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం పెరుగుతుంది.
అప్పుడే వారి వారి అభిప్రాయాల్లో అరమరికలు లేకుండా సమన్వయంగా నడుచుకోవడం సాధ్యమవుతుంది. భాగస్వామిని నలుగురిలో అవమానించడం వల్ల అవతలి వాళ్ళని అగౌరవ పరచడం కాదు దానివల్ల మన గౌరవం కూడా పోతుందని గమనించండి.ఇంకా భార్యాభర్తల మధ్య ఉండవలసిన అతి ముఖ్యమైన లక్షణం ప్రేమ.
అవునండి భార్యాభర్తలిద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ లేనప్పుడు పైన ఉన్న లక్షణాలు ఏవీ ఉపయోగపడవు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండి అవతలి వ్యక్తి కోసం ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉండాలి. స్వార్థం మాని భాగస్వామి యొక్క బాగోగులు, బాధ్యతలు తనవిగా భావించి సంసారం చేసుకుంటే నిజంగా ఆ సంసారం స్వర్గమే అవుతుంది.