Relationship: మీ భర్త మీ మాట వినడం లేదా.. అయితే ఇలా చేస్తే మీ చుట్టే తిరుగుతారు?

First Published | Jul 18, 2023, 2:27 PM IST

Relationship: భార్య భర్తల బంధం ఒక అపురూపమైన, సుదీర్ఘమైన ప్రయాణం చేయవలసిన బంధం. ఈ బంధంలో ఎప్పుడూ భర్త మాట భార్య వినటమే కాదు అప్పుడప్పుడు భార్య మాట భర్త కూడా వినాలి. అలా మీ భర్త మీ మాట వినడం లేదా అయితే ఇలా చేసి చూడండి.
 

 సంసారం ఒక ఎడ్ల బండి అయితే భార్యాభర్తలిద్దరూ చక్రాల్లాంటివారు అని అంటారు. అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా ఒకరి మాట ఒకరు వింటూ ఆ ప్రయాణం సాఫీగా సాగాలని దాని అర్థం. కానీ పురుషాధిక్య ప్రపంచంలో భార్య మాట వినే భర్తలు చాలా తక్కువగానే చెప్పాలి.
 

కానీ అలా చేయడం సరికాదు అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. భర్తను భార్య మాట వినకపోతే ముందుగా భార్య పరిస్థితిని అర్థం చేసుకొని ముందు అతను చెప్పేది మీరు వినండి. అతను చెప్పేది మీరు సహనంగా వింటున్నప్పుడు మీరు చెప్పేది కూడా అతను వినటానికి ప్రయత్నిస్తాడు.
 

Latest Videos


అలాగే మీ ప్రేమాభిమానాలతో మీ భర్తను చంటి పిల్లాడిలా భావించి అతని  అవసరాలు తీర్చుతూ అతని మెప్పుని పొందటానికి ప్రయత్నించండి. భర్తకి సేవలు చేయటం బానిసరికం కాదని గుర్తుంచుకోండి.
 

 భర్తని  చులకన చేసి  మాట్లాడితే నీ గౌరవమే తగ్గుతుంది. ఎందుకంటే భర్త గౌరవంలోనే మీ గౌరవం కూడా దాగి ఉందని మర్చిపోవద్దు. తెలివైన ఇల్లాలు భర్తని రాజును చేసి ఆ రాజుకి తను రాణిగా ఉంటుందంట.
 

 మూర్ఖురాలు భర్తని బానిసను చేసి ఆ భర్తకి తను యజమానిగా ఉంటుందంట. కాబట్టి మీ భర్తని రాజుని చేసే బాధ్యత మీదే. అలాగే భర్త కుటుంబ సభ్యులకి ఇంపార్టెన్స్ ఇవ్వటం వలన మీ మీద మీ భర్తకి ఇంప్రెషన్ పెరుగుతుంది.
 

అలాగే భర్త చేసే పని చిన్నది అయినప్పుడు అతనిని చులకన చేయటం వలన ప్రయోజనం ఏమీ ఉండదు అతనికి తోడుగా నిలబడి ప్రోత్సహిస్తే కచ్చితంగా మీరు చెప్పినట్లు వింటారు.

click me!