Relationship: బ్రేకప్ తరువాత వచ్చే ఎఫెక్ట్స్.. అబ్బాయిలపై ఇలా ప్రభావం చూపిస్తాయా?

First Published | Aug 23, 2023, 10:54 AM IST

Relationship: ఒక బంధం విచ్చిన్నమైన తర్వాత ఆ ప్రభావం ఎక్కువగా అమ్మాయిలు మీదే ఉంటుంది అనుకుంటాం కానీ ఆ ప్రభావం అబ్బాయిలపై కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ వారు ఎక్స్పోజ్ చేయరు అంతే. బ్రేకప్ తర్వాత అబ్బాయిలపై పడే ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 

సాధారణంగా ఒక రిలేషన్ బ్రేక్ అయితే ఆ అమ్మాయి ఎంత బాధ పడుతుందో అబ్బాయి కూడా అంతగానే బాధపడతాడు. కాకపోతే అమ్మాయి బహిరంగంగా తన బాధని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అబ్బాయి అంత త్వరగా అందరి ముందు తన బాధని ఎక్స్ప్రెస్ చేయలేడు.
 

తన బాధని బయట పెట్టుకోవడం ద్వారా ఒక అమ్మాయి ఆ బాధ నుంచి బయటపడుతుంది. కానీ అబ్బాయి తన బాధని బయటికి చెప్పుకోకపోవటం వలన ఆ పెయిన్ చాలా కాలం వరకు అనుభవిస్తూనే ఉంటాడు. సాధారణంగా బ్రేకప్ తర్వాత స్త్రీలు భావోద్వేగాలని వెంటనే అనుభవిస్తారు.


కానీ పురుషులు భావోద్వేగాలని అంత త్వరగా బయట పెట్టలేరు. ప్రతికూల భాగోద్వేగాలని పురుషుడిని అనే కారణంగా లోపలే అణిచి పెట్టుకుంటాడు. ఇది చాలా ప్రతికూల పరిస్థితులకి దారితీస్తుంది. అవసరమైతే వైద్య ప్రక్రియకు  కూడా కారణం అవుతుంది.
 

విడిపోయిన తర్వాత పురుషులు ఒక చిన్న సపోర్టు నెట్వర్క్ కారణంగా ఒంటరితనాన్ని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారు భావోద్వేగా కనెక్షన్ కోసం వారి శృంగార భాగస్వామిపై ఎక్కువగా ఆధారపడవచ్చు. సామాజిక పరస్పర చర్యలతో వారి శూన్యతని పూరించటానికి కష్టపడవచ్చు.

అలాగే పురుషులు పరిస్థితిని అంగీకరించడానికి, మూసివేతను కోరుకోకుండా బంధాన్ని ముందుకు సాగించటానికి ఎక్కువగా మొగ్గుచూపుతారు. వారు గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టడానికి ప్రాధాన్యతని ఇస్తారు. స్త్రీలు తమ యొక్క బాధని చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకోవడంతో తమ బాధని తీర్చుకుంటారు కానీ పురుషులు అలా చేయలేరు.
 

ఎంపిక చేసుకున్న కొంతమంది నమ్మకస్తులపై మాత్రమే ఆధారపడతారు. పురుషులు ఎక్కువగా స్వయం విశ్వాసంపై ఆధారపడతారు. తమ భావోద్వేగాలను ఇతరులకు తెలియజేయడం సవాలుగా భావిస్తారు. చివరిగా చెప్పేదేమిటంటే బ్రేకప్ వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరూ ఒకటే బాధ అనుభవిస్తారు. కాకపోతే స్త్రీ బయటపడుతుంది పురుషుడు బయటపడడు.

Latest Videos

click me!