Relationship: మీది ఉమ్మడి సంసారమా.. సమస్యలు రాకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి?

First Published | Aug 22, 2023, 4:34 PM IST

Relationship: నేటి రోజుల్లో ఉమ్మడి సంసారం అనేది గగనం అయిపోయింది. ఎక్కడో అరా, కొరా ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పటికీ నిత్యం సమస్యలతో సతమతమవుతూ ఉంటుంది ఆ కుటుంబం. అయితే ఆ ఇంటి మగవాళ్ళు ఈ చిట్కాలు పాటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. అవేంటో చూద్దాం.

ఒకప్పుడు కుటుంబాలన్నీ ఉమ్మడిగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఉమ్మడిగా ఉండటానికి ఎవరు ఇష్టపడటం లేదు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ కేవలం మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉండటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఉమ్మడి కుటుంబంలో ఉండే ఆనందం వేరు.
 

ఆ సంసారంలో కూడా కష్టసుఖాలు ఉన్నప్పటికీ సర్ది చెప్పటానికి పెద్దవారు ఉంటారు. అలాగే నేనున్నాను అని ధైర్యం చెప్పి మార్గం చూపించే వారు కూడా ఉంటారు. కాకపోతే అక్కడ కూడా సమస్యలు ఉండవని కాదు కానీ ఆ ఇంటి మగవారు కొంచెం తెలివిగా ప్రవర్తిస్తే ఆ సమస్యలను అధిగమించవచ్చు అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్.
 


ఉమ్మడి కుటుంబంలో పెళ్లి అయిన కొత్తజంట ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య ఏకాంతం. ఉమ్మడి కుటుంబంలో ఏకాంతం కాస్త తక్కువనే చెప్పాలి. కానీ దొరికిన కాస్త సమయాన్ని క్వాలిటీగా గడపండి. ఆ కాస్త సమయాన్ని అలకలు,చిలకలతో కాకుండా అనురాగాన్ని పెంచే కబుర్లు చెప్పుకోండి.

అలాగే పెళ్లయిన మగవాడికి ఎదురయ్యే మొదటి సమస్య తల్లా, పెళ్లామా.. నిజంగా ఈ సమస్యని ఎంతో తెలివైన మగవాడు తప్పితే తీర్చలేని సమస్య. ఆ మగవాడు ఇటు తల్లిని గాని అటు భార్యని గాని వదులుకోలేడు. కాబట్టి ఇద్దరితోనూ టైం స్పెండ్ చేస్తూ..
 

ఎవరికీ ఇవ్వవలసిన విలువని వాళ్ళకి ఇస్తూ ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండేలాగా  చేయవలసిన బాధ్యత ఆ మగవాడిదే. ఒక ఇంట్లో అత్తా కోడలు సఖ్యంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని గ్రహించాలి.
 

ఒక ఇంట్లో ఆడవాళ్ళ మధ్య గొడవలు సాధారణంగా వంటగదిలోనే ప్రారంభమవుతాయి. కాబట్టి ఒక ప్లానింగ్ ప్రకారం అత్త కోడళ్ళు వంట పనులు ఇంటి పనులు చేసుకుంటే ఆ ఇంటి మగవాడు సౌఖ్యంగా ఉంటాడు. అప్పుడు ఉమ్మడి సంసారంలో ఉండే ఆనందాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

Latest Videos

click me!