బంధువుల ముందు ఇలాంటి పనులు అస్సలు చేయకండి.. లేదంటే చెడ్డవారిగా మిగిలిపోతారు

First Published Dec 7, 2023, 11:43 AM IST

మీ ప్రవర్తనే మిమ్మల్ని ఇతరుల ముందు మంచిగా లేదా చెడుగా చూపిస్తుంది. అందుకే అందరితో మంచిగా నడుకోవాలి. మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. అయితే చాలా సార్లు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లను ఎగతాళి చేయడమో, తిట్టడమో చేస్తుంటారు. కానీ వీటివల్ల మీ పరువే పోతుంది. మీకు చెడ్డ పేరు వస్తుంది. అందుకే బంధువులు వచ్చినప్పుడు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. 


అతిథి దేవో భవః. అంటే అర్థమేంటో తెలుసా? మన ఇంటికి వచ్చిన అతిథి దేవుడితో సమానమని. అతిథుల రాకతో ఇళ్లంతా సందడి సందడిగా మారుతుంది. అయితే ఒక పక్క సంతోషిస్తూనే.. మరోపక్క బంధువులను చూసి టెన్షన్ పడిపోయేవారు చాలా మందే ఉన్నారు. ఈ గందరగోళంలోనే కొన్ని తప్పులు చేస్తారు. ఆ తప్పులే వారి ముందు మీరు చీప్ అయ్యేలా చేస్తాయి. అంటే మీ ముందు వారు మిమ్మల్ని చెడ్డవారు అని అనకపోయినా.. సాటుగానైనా అనుకుంటారు. అందుకే బంధువుల ముందు ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకోవాలి. 

భార్యాభర్తల గొడవల

బంధువులు ఇంటికి వచ్చినప్పుడు గొడవ పడటం మానుకోవాలి. భార్యాభర్తల గొడవలు రోజూ ఉన్నా.. బంధువుల ముందు కొట్లాడుకుంటే మాత్రం మీ పరువే పోతుంది. మీరు చెడ్డవారు అవుతారు. ఇది మీకు కామన్ గా అనిపించినా.. బంధువులకు మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకొచ్చామన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మీ స్వభావాన్ని ఎగతాళి చేస్తారు. నిజానికి ఇంట్లోకి కొత్త వ్యక్తి రావడం వల్ల కాస్త  అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు కొట్లాడకపోవడమే మంచిది. ప్రశాంతంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోండి. అంతేకానీ కొట్లాడితే మాత్రం బంధువుల ముందు మీరు చెడ్డవారికి మిగిలిపోతారు. 
 

Zodiac signs may effect parent kid relationship

పిల్లలను తిట్టొద్దు

చాలా మంది ఇంటికి బంధువులు వచ్చినప్పుడు భార్యాభర్తలు గొడవపడటమే కాకుండా పిల్లలను కూడా తిడుతుంటారు. బంధువుల పిల్లలతో పోల్చి ఎగతాళి చేస్తుంటారు. కానీ ఇది మంచి అలవాటు కాదు. దీనివల్ల మిమ్మల్ని మీరే అవమానించుకున్నట్టు అవుతుంది. అందుకే బంధువుల ముందు పిల్లలతో గట్టిగా మాట్లాడటం, అరవడం, పిల్లలను వాళ్ల ముందు కొట్టడం వంటి పనులను చేయకండి. పిల్లలు ఏదైనా చేసినా నిదానంగా చెప్పే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఇతరుల ముందు మీ సంతానాన్ని మీరే ఎగతాలి చేయడం మాత్రం మానుకోండి. 

వంట టెన్షన్

బంధువులు ఇంటికి వస్తున్నారని ముందుగానే తెలిస్తే వారికోసం ఏవేవో ముందే ప్రిపేర్ చేసుకుంటారు. అయితే బంధువులు సడెన్ గా ఇంటికి వస్తే వారికి ఏం వంటలు చేసిపెట్టాలో తొందరగా తోచదు. ఇలాంటి సమయంలో చాలా భయపడిపోతుంటారు. ఆందోళన చెందుతుంటారు. చాలా ఇళ్లలో వంటగురించే భయం ఉంటుంది. అందుకే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవటానికి సులభమైన మార్గం బయటి నుంచి ఆర్డర్ చేయడం. అవును బయటిఫుడ్ అందరికీ నచ్చుతుంది. ఇవి ఎక్కువ తక్కువ అని వంటలను వంక పెట్టడానికి ఏమీ ఉండదు. కాబట్టి సడెన్ గా వచ్చినప్పుడు వారికి ఇష్టమైన వాటిని బయటినుంచి తెప్పించండి. 
 

బంధువులకు బోర్ కొట్టనివ్వకండి

కొన్ని రోజులు వచ్చే అతిథుల ఆతిథ్యం మీ గౌరవాన్ని పెంచుతుంది. అందుకే ఈ సమయంలో మీరు ఇంటికొచ్చిన బంధువులకు బోర్ కొట్టనివ్వకుండా చూడండి. ఇందుకోసం మీరు పెద్దగా ఏం చేయక్కర్లేదు.  కాకపోతే ఇంట్లో లేదా గదిలో వాళ్లను ఒంటరిగా వదిలేయకుండా ఉండండి. అలాగే ఫోన్ లేదా టీవీ లేదా ఇతర పనులతో బిజీగా ఉంచకండి. వారితో మాట్లాడండి. లేదా ఒక ట్రిప్ ను ప్లాన్ చేయండి లేదా ఆసక్తికరమైంది ఏదైనా చేయండి. దీనివల్ల వారు సంతోషంగా ఉంటారు.. మీరు కూడా ఆనందంగా ఫీలవుతారు. ఇలా చేయడం వల్ల మీఇంటికొచ్చిన బంధువులు మీ ఇంటినుంచి సంతోషంగా వెళతారు.

click me!