ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రేమ పరిచయం అవుతుంది. అయితే, అందరికీ ఆ ప్రేమ చివరిదాకా ఉండకపోవచ్చు, కొన్ని సార్లు ఫెయిల్యూర్ కి కారణమౌతుంది. ఆ లవ్ ఫెయిల్యూర్ తట్టుకోవడం చాలా మంది వల్ల కాదు. దాని వల్ల జీవితంలో అన్నీ కోల్పోయినట్లు బాధపడేవారు కూడా ఉన్నారు. అదొక మానసిక సమస్యలా మార్చుకొని ఇతర ఇబ్బందులు కొన్ని తెచ్చుకునేవారు కూడా ఉన్నారు. అయితే, ఈ హార్ట్ బ్రేక్ నుంచి బయటపడటానికి మనం కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే చాలు అని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం....
బ్రేకప్ ని సీరియస్ గా తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు..
1. అధిక రక్తపోటు..
ప్రేమ మనసుకు సంబంధించినది కదా, శారీరకంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ,బ్రేకప్ తర్వాత గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయట. ముఖ్యంగా రక్తపోటు ఎక్కువగా పెరుగుతుందట. దీర్ఘకాలిక ఒత్తిడి అధిక రక్తపోటుకు, హృదయ స్పందన రేటును పెంచడానికి , దీర్ఘకాలంలో, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
2. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది
ఒత్తిడి హార్మోన్ల దీర్ఘకాలిక ప్రభావంతో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడే శరీర సామర్థ్యం తగ్గిపోతుంది, తద్వారా వ్యక్తులు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది.
3. నిద్రలేమిని ప్రేరేపిస్తుంది
మొత్తం ఆరోగ్యానికి మూలస్తంభం నిద్ర.హార్ట్ బ్రేక్ తో అలాంటి నిద్ర దూరమౌతుంది. నిద్ర లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అలసట వంటి సమస్యలు తలుత్తుతాయి. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది.
మరి ఈ హార్ట్ బ్రేక్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..?
1. ఏడవండి..
మీరు చదివింది నిజమే, మనసులో ఉన్న బాధ బయటకు పోవాలంటే ఏడవాల్సిందే. మీకు ఎంత బాధ ఉంటే, అంత బాధ బయటకు వెళ్లేదాక ఏడ్వాలి. అప్పుడు మీరు నిజంగా ఆ బాధ నుంచి బయటపడతారు. తర్వాత ఎలాంటి డాక్టర్ల దగ్గరకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. మీ లోపలి ఉన్న బాధ నుంచి కాస్తైన ఉపశమనం కలుగుతుంది.
2. కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ సహాయపడుతుంది
కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT) వ్యక్తులు ప్రతికూల ఆలోచనా విధానాలను రీఫ్రేమ్ చేయడంలో సహాయపడుతుంది, భావోద్వేగాలను మరింత అనుకూలీకరించడానికి వారిని అనుమతిస్తుంది. అదనంగా, ధ్యానం లేదంటే, బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం మంచిది.
3. సామాజిక మద్దతు..
హార్ట్‌బ్రేక్ ప్రభావాలను తగ్గించడంలో సామాజిక మద్దతు మరొక కీలకమైన అంశం. మనమంతా మనుషులం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడతారు.