వన్ నైట్ స్టాండ్ కి ఒకే చెప్పేముందు.. ఈ విషయాలు తెలుసుకోవాలి...!

First Published | Sep 30, 2022, 2:46 PM IST

తెలియని వ్యక్తితో శృంగారంలో పాల్గొన్న తర్వాత వారు ఆ విషయంలో తప్పు చేశాము అనే భావన కలిగి ఉండరు. ముందు సరదాగా ఉందని ప్రయత్నించి.. ఆ తర్వాత అయ్యె.. మేము మా జీవిత భాగస్వామికి అన్యాయం చేశాము అని చింతించకూడదు. 

వన్ నైట్ స్టాండ్. దీని అర్థం అందరికీ తెలిసే ఉంటుంది. ముక్కు మొహం తెలియని వ్యక్తితో ఒక రాత్రి గడపడటమే ఈ వన్ నైట్ స్టాండ్.  దీనికి ఒకే చెప్పినవారు అన్ని విషయాల్లో నిర్మోహమాటంగా ఉంటారు. తెలియని వ్యక్తితో శృంగారంలో పాల్గొన్న తర్వాత వారు ఆ విషయంలో తప్పు చేశాము అనే భావన కలిగి ఉండరు. ముందు సరదాగా ఉందని ప్రయత్నించి.. ఆ తర్వాత అయ్యె.. మేము మా జీవిత భాగస్వామికి అన్యాయం చేశాము అని చింతించకూడదు. అసలు దీనికి ఒకే చెప్పేముందు దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం...  

Image: Getty Images

మీరు రాత్రిపూట సరదాగా గడపబోయే వ్యక్తి గురించిన ప్రతి వివరాలను మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు, కానీ ముఖ్యమైన వాటి గురించి మాత్రం తెలుసుకోవాలి. వారికి ఏవైనా జబ్బులు ఉన్నాయా..? వాటి వల్ల మీరు ఏమైనా ఎఫెక్ట్ అవుతారేమో తెలుసుకోవాలి. అవేమీ లేకపోయినా.. కండోమ్ వాడటం మాత్రం తప్పనిసరి. సురక్షిత శృంగారం చాలా అవసరం. ఇది గుర్తుంచుకోవాలి. 
 


Image: Getty Images

అంతేకాదు.. మీ భద్రత కూడా చాలా ముఖ్యం.  సన్నిహిత స్నేహితుడికి లేదా మీరు పూర్తిగా విశ్వసించే ఎవరికైనా మీ ఆచూకీ తెలియజేయండి. మీరు పొరపాటున ఏదైనా ప్రమాదంలో పడితే.. సహాయం చేయగల వ్యక్తికి సమాచారం అందించడం ఉత్తమం.
 

ఇక చాలా మంది లవ్ ఫెయిల్ అయినప్పుడు వీటిని ఎంచుకుంటారు. అలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. హార్ట్ బ్రేక్ అయన సమయంలో శారీరకంగా ఎవరితోనైనా కనెక్ట్ అయితే.. ఆ తర్వాత వారితో మానసికంగా కూడా కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. తద్వారా మళ్లీ సమస్యల్లో పడతారు.

Image: Getty Images

ఇక ఈ వన్ నైట్ స్టాండ్ లో మీరు మీరులా ఉండొచ్చు. మీరు సెక్స్ విషయంలో ఉన్న అన్ని కోరికలను వారితో చెప్పి ఎంజాయ్ చేయవచ్చు. మళ్లీ ఆ వ్యక్తి మీకు కనిపించే అవకాశం లేదు కాబట్టి.. ఎలాంటి సమస్య ఉండదు. నచ్చినట్లు ప్రవర్తించవచ్చు.

Image: Getty Images


ఇక ఈ వన్ నైట్ స్టాండ్ లో హుందాగా ప్రవర్తించాలి. విపరీతంగా మద్యం సేవించకూడదు. ఏదో సరదాకి కొద్దిగా తీసుకుంటే పర్వాలేదు కానీ.. ఒళ్లు తెలీకుండా మద్యం సేవించడం మంచిది కాదు. 

Latest Videos

click me!