చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

First Published | Jun 26, 2024, 10:55 AM IST

తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం, ఎలాంటి ఆలోచన చేయకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, బంధువులు ఒత్తిడి చేయడం వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ ఇలా చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే ఏమౌతుందో తెలుసా? 

మన సమాజంలో ఒక వయసు దాటిన తర్వాత అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని బాగా ఒత్తిడి తెస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారని, బంధువులు ఇబ్బంది పెడుతున్నారని మీరు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటే మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనే నిర్ణయం మీదే ఉండాలి. ప్రేమ, అజ్ఞానంతో తీసుకునే నిర్ణయాలు, పెళ్లి గురించి తల్లిదండ్రులు, బంధువుల ఒత్తిడి వల్ల కొంత మందిని  తొందరగా పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తుంటారు. కానీ ఈ తొందరపాటు పెళ్లిళ్లు వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తాయి. అసలు చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? 
 

Marriage


చిన్న వయసులో పెళ్లి

చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం వల్ల అమ్మాయి అయినా, అబ్బాయి అయినా తమ తమ జీవితాలను స్వేచ్ఛగా గడపలేకపోతారు. ఇలాంటి వారి జీవితం, వారి కోరికలు మొత్తం కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోయి సమాధి అవుతాయి. 


ఆర్థిక సమస్యలు

చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న వారు ఆర్థికంగా ఎదగలేరు. ఎందుకంటే వారు ఆర్థికంగా స్థిరపడకముందే పెళ్లిళ్లు చేసుకుని ఉంటారు. దీనివల్ల కుటుంబ బంధాలతోనే వీరి జీవితం ఎక్కువగా ముడిపడి ఉంటుంది. దీనివల్ల వీళ్లు ఎన్నో సార్లు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

marriage

తల్లీబిడ్డల ఆరోగ్యంపై చెడు ప్రభావం 

బాల్య వివాహం అంటేనే చిన్నతనంలో పెళ్లి చేసుకోవడం. దీని వల్ల ఆ అమ్మాయి తనకు పుట్టిన బిడ్డను సరిగ్గా చూసుకోలేదు. ఎందుకంటే చిన్న వయసు వారికి పిల్లల్ని ఎలా చూసుకోవాలో అవగాహన ఉండదు. ఇది తల్లీబిడ్డల ఎదుగుదలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. చిన్న వయస్సులో తల్లి కావడం వల్ల తల్లీబిడ్డ ఇద్దరి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. 
 

చదువు లేకపోవడం

బాల్యవివాహాల వల్ల అమ్మాయిలు చదువుకు దూరమవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.  దీనివల్ల బాలికలు తమ విద్యాహక్కును కోల్పోతున్నారు. అలాగే భవిష్యత్తులో వారి శ్రేయస్సుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా భయపడతారు. 
 

కుటుంబ బాధ్యతల భారాన్ని మోయలేక..

చిన్నవయసులోనే పె0ళ్లి చేసుకోవడం వల్ల ఇది ఆడవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వారికి మానసిక, శారీరక పరిపక్వత లేకపోవడం వల్ల కుటుంబ బాధ్యతల భారాన్ని మోయలేక, తన ఆరోగ్యాన్ని తానే చూసుకోలేకపోతోంది. దీనివల్ల వీరు ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తుంది. 
 

Latest Videos

click me!