వైవాహిక జీవితంలో ప్రతికూల , సానుకూల సంభాషణలను అంగీకరించడం తప్పనిసరి. భాగస్వామి చేసే పనిని రోజులు గడుస్తున్న కొద్దీ సానుకూలం నుంచి ప్రతికూలంగా మారుతూ వస్తుంది. మొదట్లో భాగస్వామి మంచి పనులు మాత్రమే మనకు కనిపిస్తాయి. రానురాను.. వారిలో మంచి తగ్గిపోయి.. వారిలోని చెడు అలవాట్లు, తప్పులు మాత్రమే కనపడం మొదలౌతుంది. ఏదైనా సంబంధం బలంగా , సంతోషంగా ఉండాలంటే, ఇద్దరూ కలిసి నడవాలి. పరస్పర అవగాహన, నమ్మకం, ప్రేమ ఉండాలి. చాలా సమస్యలను మాటల ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఇద్దరి మధ్య చిన్న సమస్య వచ్చినప్పుడు కూర్చుని ఏం జరుగుతుందో చర్చించి పరిష్కరించుకోవాలి. చాలా సార్లు ఈ చర్చ సంబంధాన్ని మరింత దిగజార్చుతుంది. ఇద్దరి మధ్య చిన్న మనస్పర్థలు పెద్ద అగాధానికి దారితీస్తాయి. ప్రేమలో ఉన్నవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పొరపాటున కూడా వారి నోటి నుంచి ఆ విషయాలు రాకుండా చూసుకోవాలి.