భర్త నుంచి భార్య కోరుకునేదేంటో తెలుసా?

First Published | Jun 20, 2024, 12:50 PM IST

భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతి భార్య తన భర్త నుంచి కొన్ని విషయాలను ఆశిస్తారు. కానీ వీటిని భర్తలకు నేరుగా చెప్పలేరు. అవేంటంటే? 
 

అమ్మాయిలు పెళ్లి విషయంలో ఎన్నో ఆలోచిస్తారు. అలాగే తమ భర్తపై కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అయితే చాలా మంది తమ మనసులోని మాటలను భర్తకు చెప్పలేకపోతుంటారు. బిడియం, సిగ్గు మనసులోని మాటను చెప్పకుండా ఆపేస్తుంటాయి. కానీ తనకు నచ్చిన విషయాన్ని తన భర్త చేస్తాడని ఆశగా ఎదురుచూస్తుంటారు అమ్మాయిలు. ఒకవేళ తమ భర్త ఆ పనిని చేసినట్టైతే వారెంతో సంతోషిస్తారు. ఇది వారి సంబంధాన్ని మరింత బలంగా చేస్తుంది . దాంపత్య జీవితం ఆనందంగా సాగాలంటే ప్రతి భర్త ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. 
 


జాగ్రత్తగా చూసుకోవాలి

ప్రతి భార్య తన భర్త కుటుంబాన్ని జాగ్రత్తగా, గౌరవంగా చూసుకోవాలని ఆశపడుతుంది. అలాగే తన కుటుంబానికి అవసరం, ఆపద సమయాల్లో వారికి అండగా నిలబడాలని మనసులో ఎప్పుడూ అనుకుంటుంది. అలాగే తన తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని కోరుకుంటుంది.
 



తప్పులను క్షమించడం

భార్య చేసిన చిన్న చిన్న తప్పులను కూడా పదిమందికి చెప్పి తిడుతుంటారు కొంతమంది భర్తలు. కానీ ఇది మీ భార్యను అవమానించినట్టే అవుతుంది. ఇది నలుగురిలో మీ భార్య విలువను తగ్గిస్తుంది. ప్రతి భార్య తన భర్త ఇలా మాత్రం ఉండకూడదనే కోరుకుంటుంది. నా భర్త నేను చేసిన తప్పులను క్షమిస్తే చాలని భార్యలు అనుకుంటారు. 
 

గౌరవం 

ఒక అమ్మాయి భార్యగా మారిన తర్వాత భర్త ప్రేమను కోరుకోవడంతో పాటుగా భర్త నుంచి గౌరవాన్ని కూడా ఆశిస్తుంది. అమ్మాయిలు తమ భర్తలు తమతో ఎప్పుడూ గౌరవంగా మాట్లాడాలని, కుటుంబ సభ్యుల ముందు గౌరవం పొందాలని ఆశిస్తారు.

ప్రశంసలు

భార్యను పొగిడే అలవాటు చాలా తక్కువ మందికే ఉంటుంది. కానీ ప్రతి అమ్మాయి తన భర్త తమను ప్రతి పనికి ప్రశంసించాలని కోరుకుంటారు. ఇది చాలా చిన్న విషయమే అయినా వారిని ఎంతో సంతోషపెడుతుంది. ముఖ్యంగా దీనివల్ల మీ భార్యకు మీ కుటుంబంలో గౌరవం లభిస్తుంది.

సపోర్ట్ 

భార్యలు తమ భర్తల నుంచి ఎప్పుడూ  పూర్తి మద్దతును కోరుకుంటారు. జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భర్తలు అస్సలు పట్టించుకోరు. కానీ ఇలా భార్యలను వదిలేయకూడదు. కానీ భార్యలు మాత్రం భర్త తమ ప్రతి సందేహాన్ని పరిష్కరించి తమకు అండగా నిలవాలని కోరుకుంటారు.
 

Latest Videos

click me!