కబుర్లు చెప్పుకునే ఆలుమగల మధ్య బంధం ఎలా ఉంటుందో తెలుసా?

First Published Jan 25, 2022, 2:13 PM IST

ఆలుమగల బంధం అన్యోన్యంగా (Reciprocally) ఉన్నా చిన్న చిన్న అలకలు, పేచీలు సర్వసాధారణం. అవి పెద్దగా మారి గొడవలకు దారి తీయకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ బంధం పదికాలాలపాటు సంతోషంగా సాగుతుంది. ఆలుమగల మధ్య బంధం పదిలంగా ఉండడానికి కబుర్లు (Gossip) సహాయపడతాయట. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

ఆలూమగల మధ్య ఏ విషయంలోనైనా బేధాభిప్రాయాలు (Disagreements) వస్తే దాన్ని ఆ విషయానికే పరిమితం చేయడం మంచిది. అలా కాకుండా మీకు తోచింది మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా అవతలి వ్యక్తి చెప్పే మాటలను నిర్లక్ష్యం (Neglected) చేయరాదు. మీ బంధంలో కోపతాపాలకు తావు లేకుండా ఆలోచిస్తే ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అనేది ఒక స్పష్టత ఏర్పడుతుంది.
 

మీ భర్త మిమ్మల్ని సాయంత్రం వేళ సరదాగా బయటకు వెళదామని చెప్పి ఆఫీసు నుంచి రావడం ఆలస్యమైందనుకోండి. మీ భర్త ఇంట్లో అడుగు పెట్టగానే ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నలు వేసి చికాకు (Irritation) పెట్టరాదు. ఆఫీసు పనులతో అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకు విశ్రాంతి (Relax) కల్పించడం అవసరం.  కాసేపు ఆగి ఎందుకు ఆలస్యం అయిందో అడగడం మంచిది.
 

సాయంత్రం ఆఫీసు నుంచి రావడానికి ఆలస్యం అవుతుందని ఫోన్ చేసి చెబితే ఆందోళన (Anxiety) చెందను  కదా అని భర్తకు చెప్పడం మంచిది. ఈ పద్ధతిలో చెబితే మరోసారి అలా జరగదు. ఎన్ని పనులు ఉన్నా, సమయం దొరకకపోయినా భార్యాభర్తలిద్దరూ కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయాలి. ఇలా చేస్తే అలసట, ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా (Calm down) ఉంటుంది.
 

అంతేకాకుండా మీ ఇద్దరి మధ్య ఎలాంటి అపార్థాలకు (Misunderstandings) తావు ఉండదు. దీంతో మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. మంచి, చెడు ఏదైనా మనసు విప్పి మాట్లాడుకుంటే ఒకరి మీద ఒకరికి మరింత స్పష్టత (Clarity) ఏర్పడుతుంది. ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చక్కగా చేసినందుకు ప్రశంసలు కురిపిస్తుంటే ఇంట్లో అందమైన వాతావరణం ఏర్పడుతుంది.
 

మీ మధ్య దూరం ఏర్పడుతుందని చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు (Lies) చెప్పడం మంచిది కాదు. ఏ విషయాన్నైనా నిజాయితీగా చెప్పి నమ్మకం ఏర్పరచుకుంటే ఒకరి మీద ఒకరికి గౌరవం (Respect) పెరుగుతుంది. కోపతాపాలు వస్తాయేమోనని నిజాలను దాచిపెట్టి అపనమ్మకాలకు బీజం వేయరాదు. ఇలా చేస్తే బంధంలో దూరం ఏర్పడే అవకాశం ఉంటుంది.
 

అనవసరమైన కోపతాపాల (Anger) కారణంగా ఎలాంటి పరిష్కారం లభించదు. కోపతాపాల కారణంగా బంధంలో విభేదాలు (Conflicts) పెరగడం తప్ప మరి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కోపంగా ఉన్నప్పుడు మనసును కంట్రోల్ చేసుకుని మౌనంగా ఉండటం మంచిది. ఆ ఒక్క క్షణం ఓర్పుగా ఉంటే పరిస్థితులు అవే సర్దుకుంటాయి. అప్పుడే బంధం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.

click me!