జీతం: ప్రేమిస్తున్నాం కదా.. మాకు అన్ని తెలియాలి అని అనుకోకూడదు. ప్రేమలో పడిన వెంటనే.. జీతం గురించి అడగకూడదు. అతని పే స్కేల్ గురించి అడగడం వల్ల మీ వారి అభిప్రాయం వేరేలా ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేకుండా ప్రశ్న వేసినప్పటికీ, అతను మిమ్మల్ని డబ్బు వెంబడి పరుగెత్తే వ్యక్తిగా భావించవచ్చు. కాబట్టి, ప్రేమలో పడిన కొత్తలో ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు.