Relationship: భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలా.. అయితే ఈ చాణక్య నీతిని తప్పక పాటించాల్సిందే?

First Published | Aug 18, 2023, 4:04 PM IST

 Relationship: చాణక్యుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈయన బుద్ధి బలం కలిగిన ఒక గొప్ప విద్యావేత్త. ఈయన రచించిన నీతి శాస్త్రంలో భార్యాభర్తల బంధం గురించి చాలా విషయాలు వ్రాశారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
 

భార్యాభర్తల సంబంధం లో సందేహాలు అనేవి ఉండకూడదు. ఎప్పుడూ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఇద్దరి మధ్య సందేహాలు ఉంటే ఆ సంబంధం నాశనమవుతుంది. భాగస్వామిని ఎప్పుడూ అవమానించకూడదు. మీ భాగస్వామి గురించి ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే అడగడం ద్వారా మీ అనుమానం నివృత్తి చేసుకోండి.
 

అంతేగాని అనుమానం పెంచుకొని మీ భాగస్వామి మీద ద్వేషాన్ని పెంచుకోకండి. అలాగే భార్యాభర్తల సంబంధం లో అహంకారం అస్సలు ఉండకూడదు ఇది మీ సంబంధం లోని వివాదాలకు కారణం కావచ్చు.
 

Latest Videos


అహంకారం మనల్ని భాగస్వామి నుంచి దూరం చేస్తుంది. ఇంటి యజమాని అయిన భర్త ప్రతి విషయాన్ని భార్యతో చర్చించి కలిసి నిర్ణయం తీసుకోవాలి. భార్యని చులకనగా చూడటం మానివేయాలి.
 

భార్యాభర్తల ప్రేమ విషయంలో ఎటువంటి మోసం ఉండకూడదు. జీవిత భాగస్వామిని స్వచ్ఛమైన ప్రేమతో లొంగదీసుకోవచ్చు. ఒక మనిషిని స్వార్థంతో కంటే ప్రేమతో  దగ్గర చేసుకోవచ్చు. అలాగే భార్య భర్తలు ఇద్దరికీ తగినంత స్వేచ్ఛ ఇచ్చి, పుచ్చుకోవాలి.
 

చిన్న చిన్న విషయాలకి ఒకరు ఒకరు నిందించుకోకూడదు. ఇలా చేయటం వలన సంబంధాలపై ప్రభావం పడుతుంది. అలాగే కారణం లేకుండా ఒకరి మీద ఒకరు కోప్పడటం, అరుచుకోవడం చేయకూడదు. ఒకవేళ కారణం ఉన్నప్పటికీ కోప్పడకుండా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకొని సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలి.
 

అప్పుడు అది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ  క్షణాల్లో చిక్కుముడి విడిపోతుంది. అలాగే ఆదాయ వ్యయాలు కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చొని లెక్కలు వేసుకోవాలి. భర్త ఆదాయం తెలుసుకొని ఖర్చు పెట్టగలిగిన స్త్రీ , సంసారాన్ని పొదుపుగా నడిపిన స్త్రీ భార్యగా లభిస్తే ఆ భర్త కన్నా అదృష్టవంతుడు మరొకడు ఉండడు.

click me!