పెళ్లి ఆలస్యం అయినా ఏం కాదు.. ఎందుకో తెలుసా?

First Published | Aug 18, 2023, 2:34 PM IST

నీ, ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే, ఆ సమయానికి వీరు కెరీర్ పరంగా అనుకున్న స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో, కెరీర్ లో  ఇది సాధించలేకపోయాం అనే బాధ ఉండదు. మెచ్యూరిటీ పెరుగుతుంది.

MARRIAGE

చాలా మంది పెళ్లి అంటే, ఈ వయసుకే జరగాలి అంటూ ఉంటారు. ఒక వయసు దాటిన తర్వాత  పెళ్లి చేసుకున్నా ఉపయోగం ఉండదు అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ, పెళ్లి ఆలస్యం అయినా పర్వాలేదట. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు వింటే, పెళ్లి ఆలస్యమైనా పర్వాలేదు అనిపిస్తుంది. మరి అవేంటో ఓసారి చూద్దాం..

1. పెద్దలు చెప్పిన వయసుకు పెళ్లి చేసుకుంటే,  ఆ వయసులో మీరు అనుకున్న గ్రోత్ సాధించలేకపోవచ్చు. కానీ, ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే, ఆ సమయానికి వీరు కెరీర్ పరంగా అనుకున్న స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో, కెరీర్ లో  ఇది సాధించలేకపోయాం అనే బాధ ఉండదు. మెచ్యూరిటీ పెరుగుతుంది.


2.ప్రతి ఒక్కరికీ జీవితంలో పర్సనల్ గోల్స్ ఉంటాయి. వాటిని సాధించలేకపోతున్నామనే బాధ చాలా మందిలో ఉంటుంది.పెళ్లి, బాధ్యతలు, పెళ్లి వీటితోనే  గోల్స్ పక్కన పెట్టేయాల్సి వస్తుంది. అదే, పెళ్లి ఆలస్యమైతే నచ్చిన గోల్స చేరుకోవడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు.

3.పెళ్లి ఆలస్యమైతే, లైఫ్ లో ఎక్స్ పీరియన్స్ లు ఎక్కువగా పెరుగుతాయి. దీని వల్ల కమ్యూనికేషన్ సమస్యలు రావు. ఒకరినొకరు సరిగా అర్థం చేసుకునే మెచ్యూరిటీ సంపాదించుకుంటారు. కాబట్టి, పెద్దగా సమస్యలు రాకపోవచ్చు.
 

4.వయసు పెరిగే కొద్ది మన మెచ్యూరిటీ కూడా పెరుగుతుంది. తొందరగా పెళ్లి చేసుకునే వారికి ఆ మెచ్యూరిటీ లేక తొందరగా విడాకుల బాటపట్టే అవకాశం ఉంది. కానీ వయసుతో పాటు వచ్చిన మెచ్యూరిటీతో ఇద్దరి మధ్య సమస్యలు చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది.  ప్రతి దానికి అలగడం, బంధాన్ని తెంచుకోవాలని అనుకునే ఆలోచనలు రావు. బంధాల విలువ తెలుస్తుంది.

5.కంపాటబులిటీ సమస్యలు రాకుండా ఉంటాయి. మామూలుగా అయితే, చాలా మందికి కంపాటబులిటీ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే, ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఈ కంపాటబులిటీ సమస్యలు రావు.

6.ఆలస్యంగా పెళ్లి చేసుకునే జంటలకు పిల్లలును హ్యాండిల్ చేయగలుగుతారు. ఆర్థికంగా, మానసికంగా పిల్లల విషయంలోనూ అన్ని విధాలుగా సిద్ధంగా ఉండగలుగుతారు.

Latest Videos

click me!