చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారు శత్రువుల కంటే డేంజర్.. వీరికి దూరంగా ఉండటం మంచిది!

Published : Sep 24, 2025, 04:06 PM IST

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు స్నేహం, ప్రేమ, పెళ్లి బంధాల గురించి చాలా విషయాలు బోధించాడు. చాణక్యుడి ప్రకారం కొందరు వ్యక్తులు శత్రువుల కన్నా చాలా ప్రమాదకరం. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. మరి ఎలాంటివారికి దూరంగా ఉండాలో తెలుసుకుందామా..

PREV
15
చాణక్య నీతి

ఆచార్య చాణక్యుడు గొప్ప జ్ఞాని. మహా పండితుడు. ఆయన చెప్పిన నీతి సూత్రాలు సంతోషకరమైన జీవితానికి మార్గం చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ ఎంతోమంది చాణక్య నీతి సూత్రాలను ఫాలో అవుతుంటారు. చాణక్యుడి ప్రకారం శత్రువుల కన్నా ప్రమాదకరమైన వారు కొందరున్నారు. వారితో స్నేహం చేయవద్దని ఆయన హెచ్చరించారు. మరి ఆ డేంజర్ పర్సన్స్ ఎవరో తెలుసుకుందామా..

25
స్వార్థపరులు

చాణక్యుడి ప్రకారం స్వార్థపరులతో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. వారు ఎప్పుడు ఎలా మిమ్మల్ని మోసం చేస్తారో తెలియదు. వారు తమ పని అయిపోయాక మిమ్మల్ని పట్టించుకోరు. వారికి అవసరమైన సమయంలో మీ దగ్గరకు వస్తారు కానీ.. మీకు అవసరం అయినప్పుడు వారు మీకు అండగా నిలబడరు. అలాంటి వారిని ఎప్పటికీ నమ్మకూడదు. 

35
మూర్ఖులు

చాణక్యుడి ప్రకారం మంచి చెడుల మధ్య తేడా తెలియని మూర్ఖులకు దూరంగా ఉండాలి. అలాంటి వారితో ఉండటం ప్రమాదకరం. వారు ఎప్పుడు ఎలా మారిపోతారో అంచనా వేయడం కష్టం. పైగా వారు తీసుకునే తప్పుడు నిర్ణయాలు మీ జీవితంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చాణక్య నీతి చెబుతోంది.

45
నిరాశతో ఉండేవారు

నిరాశ మనిషిని ఎంత కుంగదీస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాణక్య నీతి ప్రకారం.. ఎప్పుడూ విచారంగా, నిరాశతో ఉండే వారికి దూరంగా ఉండాలి. అలాంటి వారితో ఉంటే మీరు కూడా క్రమంగా వారిలాగే మారిపోతారు. ఇది మీ జీవితంలో పురోగతిని అడ్డుకుంటుంది. ఎక్కడున్నవారు అక్కడే ఆగిపోతారు.

55
విపరీతమైన కోపం

చాణక్యుడి ప్రకారం కోప స్వభావం ఉన్నవారితో స్నేహం చేయకూడదు. వారు శత్రువుల కన్నా ప్రమాదకరం. వారికి ఆత్మ నియంత్రణ ఉండదు. కోపంలో ఏం చేస్తారో తెలియదు. వారి కోపం వల్ల మీకు హాని జరగవచ్చు. అలాంటి వారిని నమ్మడం మూర్ఖత్వమే అవుతుందని చాణక్య నీతి చెబుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories