ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ చాలా గొప్పది. మనం ఎవరినైనా ప్రేమించినా.. లేదా.. మిమ్మల్ని ఎవరైనా ప్రేమించినా.. ఆ అనుభూతి హాయిగా ఉంటుంది. అయితే.. అందరూ ఒకేలా ప్రేమించరు. ఏ ఒక్కరి ప్రేమ ఒకేలా ఉండదు. ఎవరికి మనస్తత్వానికి తగినట్లుగా వారు ప్రేమించగలుగుతారు. ఈ సంగతి పక్కన పెడితే.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. కుంభ రాశివారు.. ప్రేమ విషయంలో ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు చూద్దాం..
astrology
కుంభ రాశి ప్రేమలో ఉంటే.. వారు ప్రేమించిన వారితో ఒక స్నేహితుల్లా వ్యవహరిస్తారు. ప్రేమించిన వారితో చాలా బాగుంటారు. వారి కోసం ఏదైనా చేస్తారు. వారితో కలిసి భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటారు. వారి ఆలోచనలతో మిమ్మల్ని ఎప్పుడూ ఆకర్షించేలా చేస్తారు.
కుంభ రాశివారిని ఎవరైనా ప్రేమిస్తే.. వారికి ఎక్కువ విలువ ఇవ్వాలి. వారికంటూ సమయం కేటాయించాలి. వారిపై ఒత్తిడి పెట్టకూడదు. వారి అభిరుచులకు విలువ ఇవ్వాలి.
ఒకవేళ కుంభరాశి వారు తాము ప్రేమించినవారితో విడిపోతే.. అప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం.. ఒక్కసారి ప్రేమించిన వారికి దూరమైతే... ఇక జీవితంలో వారి గురించి ఆలోచించాలని అనుకోరు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే.. తమ జీవితం నుంచి వారికి పూర్తిగా దూరం చేస్తారు. మళ్లీ వెనక్కి తిరిగి చూడరు.
ఒక ఫ్రెండ్ గా ఈ రాశివారు చాలా ఫర్ఫెక్ట్ గా ఉంటారని చెప్పొచ్చు. తమ స్నేహితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అండగా ఉంటారు. ఎక్కువ మందితో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. వీరు మంచి శ్రోతలు.. ఎవరు ఏం చెప్పినా.. శ్రద్దగా వింటారు. ఇక ప్రతి విషయంలోనూ ప్రశ్నలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ ఉండటాన్ని ఇష్టపడతారు. కానీ.. వారు నమ్మకం ఉన్నవారితోనే స్నేహం చేస్తారు.
ఇక ఈ రాశివారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు.. చాలా సోషలైజ్డ్ గా ఉంటారు. చాలా త్వరగా ఎవరితోనైనా స్నేహం చేయగలరు. ఎవరికీ భయపడరు. చాలా ధైర్యంగా ఉంటారు. తమ పట్ల ఎక్కువగా కేరింగ్ చూపించేవారితో ఎక్కువ ప్రేమగా ఉంటారు.
ఇక ఈ రాశివారు తల్లిదండ్రులుగా మారితే.. బెస్ట్ పేరెంట్స్ గా మారే అవకాశం ఉంటుంది. తమ పిల్లలకు ఏది కావాలో దగ్గరుండి చూసుకుంటారు. పిల్లలు ఇండిపెండెంట్ గా మారేంత వరకు అండగా నిలుస్తారు.