తొలి కలయిక నొప్పి కలిగిస్తుంది.. ఈ విషయం మనకు తెలిసిందే. తర్వాతర్వాత కలయిక ఆనందాన్ని ఇస్తుంది. దీంతో.. రోజూ కలయికను ఆస్వాదించగలుగుతారు. అయితే.. కొన్నిసార్లు మాత్రం మహిళలు.. రోజూ పాల్గొనే శృంగారమైనా అప్పుడప్పుడు మాత్రం నొప్పి కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా.. పీరియడ్స్ టైమ్ దగ్గరపడితే చాలు.. కలయిక మరింత బాధిస్తూ ఉంటుంది.
sex life
అయితే.. ఇది ఒకరిద్దరిలో మాత్రమే కాదు.. చాలా మందిలో ఈ సమస్య తలెత్తుతోందట. అసలు ఈ నొప్పి ఎందుకు వస్తోంది..? అసలు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నిపుణులు మనకు సూచిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
చాలా మంది మహిళలకు జననేంద్రియ ప్రాంతాల వద్ద నొప్పి కలుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొనడం వల్ల జననాంగాలు కదిలి... మరింత నొప్పి కలుగుతుంది. అప్పుడప్పుడు.. ఆ ప్రాంతంలో పుండ్లు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పుండ్లు వచ్చినప్పుడు వైద్యులను సూచించి.. దానికి తగిన చికిత్స తీసుకోవాలి.
ఇక చాలా మంది మహిళలకు జననాంగాలు పొడిబారుతూ ఉంటాయి. దానివల్ల కూడా నొప్పి కలుగుతుంది. అలాంటి సమయంలో సెక్స్ చేయడం ఆపకూడదట. జనానాంగాలు పొడిబారినా కూడా కలయికలో పాల్గొనాలి. ముఖ్యంగా.. రొమాన్స్, ఫోర్ ప్లేకి ఎక్కువ స్కోప్ ఇవ్వాలి. అప్పుడు కలయికను ఆస్వాదించవచ్చు.
జనానాంగాలు పొడిగా ఉన్నప్పుడు లూబ్ ని ఉపయోగించాలి. దానిని ఉపయోగించడం వల్ల యోనిలో పొడి తగ్గిపోతుంది. ఈ లూబ్ ని ఎప్పుడైనా వినియోగించవచ్చు. దీని వల్ల సాంత్వన కలుగుతుంది.
మహిళలు తమ పీరియడ్స్ సైకిల్ పై ఓ కన్నేసి ఉంచాలి. చాలా మంది ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తుందోనని.. ఏ సమయంలో సెక్స్ చేయకూడదో చూసుకుంటూ ఉంటారు. అయితే.. దానికన్నా ముందు అంటే.. పీరియడ్స్ ప్రారంభం కావడానికి ముందు ఏ రోజు సెక్స్ చేస్తే.. మీకు నొప్పిగా.. ఇబ్బందిగా ఉంటుందో గుర్తించాలి. అప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలనే విషయం అర్థమౌతుంది,
ఇక కలయికలో పాల్గొన్న సమయంలో.. భరించలేని నొప్పి కలిగినప్పుడు.. మీ పార్ట్ నర్ తో ఆ విషయాన్ని చెప్పడం ఉత్తమం. ఆ నొప్పిని భరిస్తూ... కలయికలో పాల్గొనాల్సిన అవసరం లేదు. కాబట్టి.. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందిని వారితో పంచుకుంటే.. ఆ నొప్పి కలగకుండా.. వేరే స్టైల్ లో సెక్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి.. మీ ఇబ్బందిని మీ పార్ట్ నర్ తో షేర్ చేసుకోవడం తప్పనిసరి.