పైకి మంచిగా కనిపించే వీళ్లతో చాలా డేంజర్

First Published | Sep 18, 2024, 1:01 PM IST

కంటికి కనిపించేదంతా నిజం కాదు. ఎందుకంటే మీతో నవ్వుతూ మాట్లాడే వాళ్లే మిమ్మల్ని మోసం చేయొచ్చు. మీ ముందు మిమ్మల్ని పొగిడే వాళ్లే మీ వెనకాల గోతులు తీయొచ్చు. ఈ అద్భుత ప్రపంచంలో అంతా నటులే. అయితే స్వార్థం కోసం కొంతమంది అతిగా నటించి మెప్పు పొందడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారిని గుర్తించడం ఒకరకంగా కష్టమే. అయితే ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు ఎవరిలో ఉంటే వారితో మీరు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. 
 

మేక తోలు కప్పుకున్న పులులు..
మనలో చాలా మంది వారి ఒరిజినాలిటీని దాచి పెట్టి నటిస్తూ జీవిస్తారు. ‘మేకవన్నె పులి’ అనే సామెత వినే ఉంటారు కదా.. ఇది ఇలాంటి వారికి సరిగ్గా సరిపోతుంది. పైకి మాత్రం జాలి, దయ అంటూ ముసుగు వేసుకొని మాట్లాడతారు. అందరికీ వారి రేంజ్ ను బట్టి కష్టాలుంటాయి. అయితే ఈ కేటగిరీ వ్యక్తులు మాత్రం వారికి మాత్రమే కష్టాలున్నాయని, అందరూ వారిపై జాలి చూపాలని కోరుకుంటారు. మీరే కష్టంలో ఉంటే మీ దగ్గరకే వచ్చి వారి కష్టాలు చెప్పుకొంటారు. మీ కష్టం అసలు కష్టమే కాదని, వారే ఎల్లప్పుడూ కష్టాల్లో మునిగి తేలుతుంటామని ఓ బాధ పడిపోతూ ఉంటారు. 

ఇలాంటి వారు మీకు కనిపిస్తే వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. వారితో ఎంత వరకు ఉండాలో అంతే ఉండండి. 

మీ బాధను వారు పట్టించుకోరు..
కొందరు ఎలా ఉంటారంటే.. చాలా నవ్వుతూ మాట్లాడతారు. ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ప్రేమను కురిపిస్తారు. ఇంత క్లోస్ గా ఉంటున్నారు కదా అని మీ కష్టాలు వారికి చెప్పడం స్టార్ట్ చేశారనుకోండి. అంతే ఇక వారు మిమ్మల్ని మాట్లాడనివ్వరు. మీరు ఇబ్బందుల్లో ఉంటే వాటిని పట్టించుకోరు. మీరు రిలాక్సేషన్ కోసం మీ ప్రాబ్లమ్స్ ను వారిలో షేర్ చేసుకున్నారనుకోండి. వారు అవి వినరు. వాటిని కేర్ లెస్ గా కొట్టిపాడేస్తారు. అంతకంటే ఎక్కువ కష్టాలు తమవని వారి బాధలన్నీ చెప్పడం ప్రారంభిస్తారు. 

ఇలాంటి వారు ప్రతిసారీ మీ ఒపీనియన్స్ ని విసుగ్గా పక్కన పెట్టేస్తారు. అలాంటి వారు మీ గర్ల్ ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా మీకు సరైన వారు కాదని మీరు గుర్తించాలి. ఇలాంటి వారితో మీ జీవితం సాఫీగా సాగదు. అలాంటి వారితో కాస్త డేంజర్ సుమా.
 


సెల్ఫిష్ పర్సన్
కొందరు ఎలా ఉంటారంటే.. ఎప్పడూ మీతోనే ఉంటారు. మీకు తెలియకుండా మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తారు. ఇది  మీరు చాలా కాలం వరకు గుర్తించలేరు. వ్యక్తిగత లాభం, అధికారం కోసం వారు ఇలా చేస్తారు. మీతో పనుంటేనే వారు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. మీరు అనుకున్న దాన్ని సాధించకుండా వారు అడ్డుపడుతుంటారు. ఈ విషయాన్ని మీరు గుర్తించలేరు. నష్టం జరిగిపోయాక అలాంటి వ్యక్తుల అసలు రంగు బయటపడుతుంది. 

ఇలాంటి వారు కనిపించేంత మంచి వ్యక్తులు కాకపోవచ్చు. వారి మానిప్యులేషన్ కు మీరు లొంగిపోవద్దు. 
 

తప్పును ఒప్పుకోరు
సరైన పర్సన్స్ ఎప్పడూ వారు చేసిన తప్పును ఒప్పుకుంటారు. చేయలేదని వాదించరు. అయితే ఏదైనా సందర్భంలో మీ ఫ్రెండ్ లేదా రిలేటివ్, క్లోజ్ పర్సన్ తో మీకు ఆర్గ్యుమెంట్ జరిగింది అనుకుందాం. ఆ సమయంలో నిజంగా తప్పు ఎదుటి వ్యక్తి సైడ్ ఉందనుకోండి. ఆ విషయం వారికి కూడా తెలుస్తుంది. కాని మీ ముందు ఒప్పుకోవడానికి అహంభావం అడ్డు వస్తుంది. తప్పు ఒప్పుకోకపోగా మీతోనే వాదనకు దిగుతారు. ఇన్నాళ్లు మీతో క్లోజ్ గా ఉన్న విషయాలన్నీ మర్చిపోతారు. తప్ప వారిదే అయినా మీదేనన్నట్లుగా బ్లేమ్ చేస్తారు. 

వారి తప్పులను వారికి క్లియర్ గా చెప్పడానికి మీరు ప్రయత్నించినా వారు వినరు. తప్పు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి పర్సన్స్ తో  మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 
 

జాలి లేని వారితో డేంజర్
అసలు మనిషి జన్మకు సార్థకం మంచిగా జీవించడం. అయితే కొందరు వ్యక్తులు ఎలా ఉంటారంటే జాలి, దయ అస్సలు ఉండవు. ఇలాంటి వారు పైకి ఎంత అందంగా కనిపించినా మనసులో మాత్రం చాలా క్రూరంగా ఉంటారు. వారికి అసలు జాలి, దయ ఉండవు. మీరు బాధపడినప్పుడు వారు మిమ్మల్ని ఓదార్చరు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు, వారు మీ ఆనందాన్ని పంచుకోరు. ఎప్పుడూ ఏదో మూడీగా కనిపిస్తారు. 

ఇలాంటి వ్యక్తి మీకు చాలా క్లోజ్ అయినా వారితో మీరు ఎంత తక్కువ బంధం పెట్టుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనిషికి ఉన్నత ఆలోచనలు ఉంటేనే సమాజంలో మానవత్వం పెరుగుతుంది. 
 

గాసిప్స్ ప్రచారం చేస్తారు
ఈ కేటగిరీ వ్యక్తులు మరీ డేంజర్. ఎందుకంటే వీరు ఊహలను నిజాలుగా ప్రచారం చేస్తారు. అసలు ఏమీ జరగకుండానే ఏదో జరిగిపోయినట్లుగా వారు అనుకోవడమే కాదు. ప్రపంచాన్ని నమ్మించడానికి ట్రై చేస్తారు. మీతోనే ఉంటూ మీరు లేనప్పుడు మీ గురించి తప్పుడు ప్రచారం చేస్తారు. దీని వల్ల మీపై ఇతరులకు కూడా నమ్మకం పోతుంది.

ఇలాంటి వ్యక్తుల వల్ల మీరు ఎంతో కోల్పోతారు. మనశ్శాంతి, ప్రశాంతత ఉండదు. ఇలాంటి వారు మీతోనే ఉన్నా మీరు గుర్తించడం కూడా కష్టమే. ఎందుకంటే వారు మీ ముందు అలా బిహేవ్ చేయరు. ఈ కేటగిరీ వ్యక్తులు మీకు ఎంత క్లోజ్ అయినా వారిని ఎంత దూరం పెడితే అంత మంచిది. 
 

Latest Videos

click me!