ఈ కాలంలో ఎవరిని అడిగినా.. తాము లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటారు కానీ.. అరేంజ్డ్ మ్యారేజ్ వైపు అసలు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకలా అంటే.., ముక్కు, మొహం తెలియని వారిని పెళ్లి చేసుకోవడం కంటే.. ప్రేమించి.. తమకు అన్నీ తెలిసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఉత్తమమని భావిస్తారు. అయితే.. నిజానికి ప్రేమ పెళ్లి కంటే.. పెద్దలు చేసే పెళ్లి వల్లే ఎక్కువ లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ లాభాలేంటో ఓసారి చూద్దాం..
పెద్దలు కుదిర్చిన పెళ్లిలో.. ఇంట్లోవారు చెప్పినట్లు పెళ్లి చూపుల్లో ఓ వ్యక్తిని చూసుకుంటాం. ఆ తర్వాత అన్నీ నచ్చితే.. పెళ్లి చేసుకుంటారు. అయితే.. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో.. ఓ వ్యక్తిని కలుస్తున్నాం అంటే.. ఎందుకు కలుస్తున్నామనే క్లారిటీ ఉంటుంది. ఆ వ్యక్తి నచ్చితే.. తర్వాత నెక్ట్స్ స్టెప్ ఏంటి అనే విషయం కూడా క్లారిటీ ఉంటుంది. కానీ.. ప్రేమ విషయంలో అలా కాదు. కలుసుకున్న ప్రతి వ్యక్తితో ప్రేమలో పడలేరు. ఒకవేళ ప్రేమలో పడినా.. అది పెళ్లిదాకా దారితీస్తుందనే గ్యారెంటీ ఉండదు. డేటింగ్ లోనే ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. లేదా మోసపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
Wedding
ఇక పెద్దలు కుదర్చిన పెళ్లిలో... ముందుగానే ఒక కుటుంబం నుంచి మరో కుటుంబానికి తెలుస్తుంది. కాబట్టి.. చివరి నిమిషంలో.. మీరు అలా.. మేము అలా అంటూ గొడవలు, వాదనలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సంప్రదాయాల్లో తేడాలు ఎక్కువగా ఉండకపోవచ్చు.
bride
ఇక.. అరేంజ్డే మ్యారేజ్ లో మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి.. నుంచి మీరు ఏం కోరుకుంటున్నారనే క్లారిటీ పక్కా ఉంటుంది. ఆ క్లారిటీతోనే.. పెళ్లి వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది.
wedding video
పెద్దలు కుదర్చిన పెళ్లిలో.. ఒక అబ్బాయిని ఎంపిక చేస్తున్నారంటే.. అతని గురించి పూర్తి నిజాలు తెలుసుకునేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తారు. అబ్బాయి గురించి పూర్తి నిజాలు తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Desi Bride Refuses
ఇక.. అరేంజ్డ్ మ్యారేజ్ లో బ్యాగ్రౌండ్ చెక్ చేసుకుంటారు. ఈ విషయంలో ఎవరూ తప్పులు వెతికే అవకాశమే ఉండదు. ఎందుకంటే.. ఇరు వైపుల కుటుంబసభ్యులు ఈ పని చేస్తారు కాబట్టి.
సరిగ్గా పెళ్లి క్షణంలో డ్రామాలు చోటుచేసుకునే అవకాశం చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే.. ముందుగానే అన్ని విషయాలను చర్చించుకుంటారు కాబట్టి.. పెద్దగా సమస్యలు వచ్చే అవకాశం తక్కువ.
ఇక ఈ అరేంజ్డ్ మ్యారేజ్ లో.. ఒకరితో ఒకరికి బోర్ కొట్టదు. ఎందుకంటే.. వీరికి ఒకరి గురించి మరొకరికి తెలుసుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. ముందుగానే తెలిసి ఉంటే.. వారికి బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. కానీ.. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో అలా ఉండదు కాబట్టి.. అంతా కొత్తగా ఉంటుంది.. ప్రతి నిమిషం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ప్రేమ పెంచుకునే అవకాశం ఉంటుంది.